రామ్‌చరణ్ నిర్మాతగా మారి తన సొంత బేనర్ కొణిదల బేనర్‌లో తన తండ్రిని హీరోగా పెట్టి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్ 150'ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన అభిమానులతో లైవ్ చాట్‌లో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను హీరోగా మూడు చిత్రాలు ఒప్పుకున్నానని, అవి పూర్తయిన తర్వాత తర్వాతి చిత్రాలను ప్రకటిస్తానని, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలు ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఇక ఇటీవలే మహేష్ విదేశీ టూర్‌లో కూడా కలిసి ఫొటోలు దిగిన చరణ్ తనకు మంచి సబ్జెక్ట్ వస్తే మహేష్‌తో కూడా కలిసి నటిస్తానని తెలిపాడు. ఇక సంక్రాంతికి పెద్ద హీరోల చిత్రాలు క్లాష్ అవ్వడం కామనేనని, గతంలో కూడా తన చిత్రానికి, మహేష్ చిత్రానికి క్లాష్ వచ్చినా రెండు చిత్రాలు బాగా ఆడాయని తెలిపాడు. అదే సమయంలో ఆయన బాలయ్యకు, డైరెక్టర్ క్రిష్‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కానీ మరో విషయంలో మాత్రం కొందరు చరణ్‌పై విమర్శలు చేస్తున్నారు. చరణ్ మాట్లాడుతూ, తమ చిత్రాన్ని కూడా మొదట జనవరి 12న రిలీజ్ చేయాలని భావించామని, అదే రోజు బాలయ్య వస్తుండటంతో తన తండ్రి చిరు ఒకే రోజున ఇద్దరం రావడం మంచిది కాదని చెప్పడంతో తాము ఒక రోజు ముందుగా అంటే జనవరి11నే వస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. కాగా తెలుగులోనే కాదు.. పలుభాషల్లో చిత్రాలు శుక్రవారం రిలీజ్ చేయడం కామన్. రిలీజ్ డేట్ విషయంలో ముందు నుంచి మెగాక్యాంపు ఎంతో ప్లానింగ్ రెడీ చేసింది. బాలయ్య చిత్రం కంటే ఒకరోజు ముందుగా విడుదల చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యారు. తద్వారా తొలిరోజు భారీ ఓపెనింగ్స్‌పై కన్నేశారు. అందుకే బాలయ్య చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించే దాకా వేచి చూశారు. ఇది వాస్తమని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ రెండు పెద్ద చిత్రాలకు క్లాష్ రాకూడదని భావిస్తే, బాలయ్య వస్తున్న 12న కాకుండా శుక్రవారం అంటే ఒకరోజు ఆలస్యంగా 13న రావచ్చు కదా..! ఈ విషయంలో తాము ఉదాత్తంగా వ్యవహరించామని చెప్పడం ఎంత వరకు సమంజసమని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మరి వీటిపై చిరు, బాలయ్య ఫ్యాన్స్ వాదనలు ఎలా ఉన్నాయో వేచిచూడాల్సివుంది....!