పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీ అవుతున్నాడు. అదే సమయం లో సినిమాల్లో కూడా స్పీడు పెంచాడు. 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ తో పాటే అటు ప్రజల పక్షాన కూడా సమస్యల పోరాటానికి ఏపీ ప్రభుత్వం పై కాలు దువ్వుతున్నాడు. అక్కడ ప్రభుత్వానికి ఉద్దానం కిడ్నీ సమస్యపై 48 గంటల గడువు విధించాడు. మరో పక్క సినిమా విషయం లోను తగ్గడం లేదు ప్రస్తుతానికి సెట్స్ మీదున్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ తో పాటే త్రివిక్రమ్ సినిమాను, ఏ ఎమ్ రత్నం సినిమాను లైన్ లో పెట్టిన పవన్ తన తాజా సినిమా 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ తో పాటు సెకండ్ లుక్, థర్డ్ లుక్ తో ఈ న్యూ ఇయర్ కి సందడి చేసాడు. ఇక ఆ లుక్స్ లో పవన్ పంచె కట్టుతో అదరగొట్టాడు. మాస్ లుక్ తో మీసం మెలితిప్పిన పవన్ చాలా లేట్ గా ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడని 'కాటమరాయుడు' కథ ప్రకారం అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా ఆడియో ని వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత శరత్ మరార్. అందుకోసమే పాటల చిత్రీకరణను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.
ఇక 'కాటమరాయుడు' ఆడియో ఈవెంట్ ని ఎక్కడ ఎలా ప్లాన్ చెయ్యాలా... అని నిర్మాతతో పాటే పవన్, డైరెక్టర్ డాలి ఆలోచిస్తున్నారట. అయితే ఈ ఈవెంట్ ని సినిమా స్టోరీ రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి రాయలసీమ ప్రాంతమైన అనంతపురం లేదా తిరుపతిలో చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. ఇక అలా గనక జరిగితే టాలీవుడ్ పెద్ద సినిమాల ఈవెంట్స్ ఎక్కువగా ఏపీ ప్రాంతంలో జరుపుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాల ఆడియో ఫంక్షన్స్ అన్ని చాలా వరకు హైద్రాబాదులోనే జరిగేవి. మరి ఇప్పుడు ట్రెండ్ మారింది చాలా సినిమాల ఫంక్షన్స్ ని అటు ఏపీలో జరగాలని కోరుకుంటున్నారు నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్స్. అంటే వీరంతా తెలంగాణలోని హైదరాబాద్ ని ఏవోయిడ్ చేస్తున్నట్టేగా..!