అమితాబ్ హోస్ట్‌గా చేసిన 'కౌన్‌బనేగా కరోడ్‌పతి' తరహాలోనే మాటీవీలో నాగార్జున హోస్ట్‌గా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌షో పెద్ద సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి మూడు సీజన్ల పాటు హోస్ట్‌గా పనిచేసిన నాగ్ కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా మొనాటనీ వస్తుందనే భయంతో దాని నుండి బయటకు రావడంతో మెగాస్టార్‌తో ఈ ప్రోగ్రాంను చేయాలని ఆ చానెల్ నిర్ణయించింది. ఈ ప్రోగ్రాం ప్రోమోతో పాటు టీజర్‌లో చిరు... 'వెండితెరపై మీరు నన్ను గెలిపించారు. బుల్లితెరపై మిమ్మల్ని గెలిపించేందుకు వస్తున్నాను.. కమాన్ లెట్స్ ప్లే' అంటూ అదరగొట్టాడు. కాగా దీనికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ ముగిసినా, ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశం అయింది. మొదటి విజయదశమి కానుకగా అన్నారు. ఆ తర్వాత డిసెంబర్12 నుండి అని వార్తలు వచ్చాయి. క్రిస్మస్ కూడా వెళ్లిపోయి, కొత్త ఏడాది కూడా వచ్చింది. త్వరలో సంక్రాంతి రానుంది. కానీ ఈ కార్యక్రమం మాత్రం క్యాన్సిల్ అవుతూ ఉండటంతో బుల్లి తెరపై కూడా చిరు తన మ్యాజిక్ చేస్తాడని ఎందరో ఎదురుచూస్తున్నా.. ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కాలేదు. ఈలోపు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ పృథ్వీ ప్రధానపాత్రలో ఓ చిత్రం కూడా వచ్చింది. అయితే చిరు 150వ చిత్రం 'ఖైదీ నెంబర్150' విడుదలైన తర్వాత ఓ నెలరోజు గ్యాప్ తీసుకొని, ఈ ప్రోగ్రాంను ప్రసారం చేయమని చిరు చానెల్ అధినేతలపై ఒత్తిడి తేవడంతోనే ఈ కార్యక్రమం ఇంత లేటు కావడానికి కారణంగా తెలుస్తోంది. మరి చూద్దాం... బుల్లితెరపై మెగాస్టార్ ఎప్పుడు దర్శనమిస్తాడో....?