Advertisement
Google Ads BL

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ కి కొదవుండడా..?


సంక్రాంతికి విడుదల కానున్న చిరు 'ఖైదీ నెంబర్‌ 150' బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లతో పాటు దిల్‌రాజు-శర్వానంద్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'శతమానం భవతి' చిత్రం కూడా రేసులోనే ఉంది. కాగా జనవరి11న చిరు, జనవరి12న బాలయ్య, జనవరి14న దిల్‌రాజుల చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాలపై మంచి అంచనాలు ఉండటం, చిరు, బాలయ్య సినిమాలకు ఇప్పటి నుండే థియేటర్లను బ్లాక్‌ చేస్తున్నారు. ఇక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పట్టున దిల్‌రాజు చిత్రానికి కూడా థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం లేదు. ఈ విషయంలో దిల్‌రాజు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఈ మూడు చిత్రాలు కొద్ది గ్యాప్‌లోనే థియేటర్లలో సందడి చేయనుండటంతో ఈ చిత్రాలకు ఖచ్చితంగా థియేటర్ల సమస్య, ఓపెనింగ్స్‌ విషయంలో ఇబ్బందులు తప్పవని అర్ధమవుతోంది. తాజాగా హైదరాబాద్‌ హైకోర్టు థియేటర్ల టిక్కెట్ల రేట్లను వెంటనే పెంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం ముఖ్యకార్యదర్శులు, హోంశాఖ అధికారులతో కమిటీ వేసి, నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ రిపోర్ట్‌ వచ్చే నాటికి మార్చి వరకు గడువు ఇచ్చింది. అయినా తక్షణమే టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ సంక్రాంతి సినిమాల సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

వాస్తవానికి చిన్నపిల్లలు వీడియో గేమ్స్‌, యువత సోషల్‌మీడియాలో ఛాటింగ్‌లు, ఇతర పనుల్లో మునిగిపోవడం, మహిళలను బుల్లితెరలు ఆకట్టుకుంటూ ఉండటంతో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిందనేది వాస్తవం. కానీ ఇప్పటికే థియేటర్ల టిక్కెట్టు రేట్లు, మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఈ ధరలు విపరీతంగా పెరగడంతో సినిమాలకు మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఒకప్పుడు 1000 మంది చూస్తే వచ్చే కలెక్షన్ల కంటే ఇప్పుడు 100మంది చూస్తే వచ్చే కలెక్షన్లే ఎక్కువగా ఉండటం దీనికి ఉదాహరణ. దాంతో పెద్ద పెద్ద స్టార్స్‌ చిత్రాలు మొదటి వారంలోనే కోట్లు వసూలు చేస్తున్నాయి. టిక్కెట్ల రేట్లు అయితే పెంచుతున్నారు కానీ థియేటర్లలో మంచినీటి సౌకర్యాలుగానీ, టాయిలెట్లు కానీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు అసౌకర్యంగా ఉంటున్నాయి. అయినా పట్టించుకునే నాథుడులేడని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య హిస్టారికల్‌ మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వినోదపు పన్ను మినహాయింపు లభించడంతో ఈ చిత్రం యూనిట్‌ ఎంతో ఆనందంగా ఉంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs