టాలీవుడ్ నటుడు నారా రోహిత్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’ మంచి ఫలితాన్నే రాబట్టిందని చెప్పాలి. ఈ సినిమా విజయానందంతో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కి టాలీవుడ్ విమర్శకులతో మంచి ప్రశంసలు అందుకుంది. నారావారికి నూతన సంవత్సరానికి గాను ఇచ్చిన కొత్తబోణీగా ఈ చిత్రాన్ని అభివర్ణించవచ్చు. కాగా గత కొంతకాలంగా నారా రోహిత్ సినిమాలపై పూర్తి ఏకాగ్రతతో కూడిన దండయాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా సీరియస్ గా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న విషయం కూడా విదితమే.
అయితే తాజాగా నారా రోహిత్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు పొక్కుతున్నాయి. ఇప్పటివరకు బ్యాచలర్ గా ఉంటూ మంచి ఆకట్టుకునే కథాంశాలను ఎంచుకొని సినిమాలు తీసిన నారా రోహిత్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడుతున్నట్లుగా, అందుకు తాను సిద్ధం అవుతున్నట్టుగా కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకనుగుణంగా రోహిత్ ఇంట్లో ఇప్పటికే పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు చాలా మంది పెళ్ళి చేసుకుంటున్నారన్నమాట. మొదటి వరుసలో అఖిల్ ఉండగా, ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత ప్రభాస్ లు ఉన్నారు. అయితే మొత్తానికి నారా రోహిత్ కూడా ఆ జాబితాలో చేరినట్టుగానే భావించాలి మరి. అందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.