సూపర్ స్టార్ మహేష్ పెద్ద షాకిచ్చాడు. ఎప్పుడు గుంభనంగా పెద్దగా మాట్లాడకుండా తన పని తానూ చేసుకుపోయే మహేష్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్నాడు. ఎప్పుడు ఎవరిని పల్లెత్తి మతనకుండా ఉండే మహేష్ ఇప్పుడు కూడా సైలెంట్ గా తన పని తానూ చేసుకుపోతున్నాడు. మహేష్ 24వ చిత్రం వంశీ పైడి పల్లి దిరెచ్తిఒన్ లో ఉంటుందని దాన్ని పివిపి నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని అనుకున్నవారికి వారి మధ్య గొడవలతో అది కాస్తా దిల్ రాజు, అశ్వినీదత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
అసలిదంతా ఎందుకు జరిగిందో ఏమో గాని. మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం సీఎంగా ఘోర ప్లాప్ అవడం వలన ఆ లాస్ ని పూడ్చానికి పివిపితో మరో సినిమా కి కమిట్ అయ్యాడు. ఇక వంశి కూడా ఊపిరి కి వచ్చిన లాస్ ని పూడ్చడానికి పివిపి సంస్థలో ఒక సినిమా చేసి పెడతానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట కాదని మహేష్, వంశి పైడిపల్లి ఇద్దరూ దిల్ రాజు నిర్మాణం లో మూవీ చెయ్యడానికి రెడీ అవ్వడం అది కాస్త పివిపి కి కాలి వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం వంటి కథ జరగడంతో ఇప్పుడు మహేష్ తాజాగా ఒక ట్వీట్ చేసాడు.
అదేమిటంటే తన 24వ సినిమాను శివ కొరటాల డైరక్షన్లో డివివి దానయ్య ప్రొడక్షన్లో చేస్తున్నట్టు, 25వ సినిమాను వంశీ పైడిపల్లి డైరక్షన్లో దిల్ రాజు అండ్ అశ్వినీ దత్ లతో చేస్తున్నాని. 26వ సినిమాను త్రివిక్రమ్ డైరక్షన్లో మైత్రి వారికి చేస్తున్నాను ట్వీట్ చేసాడు. మరి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసాడు అని అందరూ చెవులు కోరుకుంటున్నారు. మహేష్ కూడా పివిపి కి హ్యాండ్ ఇచ్చేసి వీళ్ళతో సినిమాలు చెయ్యడానికి సిద్ధమైపోయాడు.