Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో కూడా విపరీతపోకడలు..!


అప్పుడెప్పుడో హాలీవుడ్‌కే పరిమితమైన విచ్చలవిడి శృంగారం సీన్స్‌, లిప్‌కిస్‌లు, బికినీలు, అడల్ట్‌ కామెడీ పేరుతో బూతు వంటివి ఆ తర్వాత మలయాళ, బాలీవుడ్‌ పరిశ్రమలు బాగా ఒంటపట్టించుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో విచ్చలవిడి శృంగారంతో చిత్రాలు వస్తున్నాయి. అదేమంటే అడల్ట్‌ మేసేజ్‌ పేరుతో శృంగార చిత్రాల హవా నడుస్తోంది. ఈ తరహా చిత్రాలు ఈమద్య టాలీవుడ్‌లో కూడా జోరందుకుంటున్నాయి. ఒకప్పుడు కన్నడ కాశీవిశ్వనాథ్‌ తీసిన చిత్రాలు, కోడిరామకృష్ణ, ఇవివి వంటి వారు తీసిన కొన్ని చిత్రాలలో డబుల్‌ మీనింగ్స్‌ ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా కోడిరామకృష్ణ.. బాలకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 'ముద్దుల కృష్ణయ్య', ఇవివి... చిరుల కాంబినేషన్‌లో వచ్చిన 'అల్లుడా... మజాకా' వంటి చిత్రాలలో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఆ తర్వాత ఉపేంద్ర తీసిన చిత్రాలు, తాజాగా మారుతి వంటి దర్శకుల చిత్రాలలో కూడా అదే హవా కొనసాగుతోంది రానురాను హద్దు మీరిన శృంగారం, బూతు, లిప్‌లాక్‌ల వంటివి ఇప్పుడు పెద్ద హీరోల చిత్రాలలోనే గాక, సకుంబసమేతంగా చూసే చిత్రాలలో కూడా ఎక్కువైపోయాయి.

Advertisement
CJ Advs

బాలీవుడ్‌లో అడల్ట్‌ కంటెంట్‌తో వచ్చి హిట్టయిన 'హంటర్‌' చిత్రం రీమేక్‌ ప్రస్తుతం తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుకే కేవలం విరహంతో కొరికే లేడీ లిప్స్‌తో హాట్‌టాపిక్‌ అయింది. ఇక నిన్న తాజాగా విడుదలైన విజయ్‌దేవరకొండ, శాలిని జంటగా సందీప్‌ అనే నూతనదర్శకుడు తెరకెక్కిస్తున్న 'అర్జున్‌రెడ్డి' చిత్రం ఫస్ట్‌లుక్‌లో హీరోహీరోయిన్ల మద్య వచ్చే లిప్‌లాక్‌ సీన్‌ లుక్‌ హాట్‌టాపిక్‌గా మారింది. 'పెళ్లిచూపులు'వంటి క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తన సత్తా చాటుకున్న హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం కావడం, ఇందులో అలనాటి మేటి నటి కాంచన బామ్మగా నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని కుటుంబసమేతంగా చూడవచ్చని భావిస్తున్న ప్రేక్షకులు ఈ ఫస్ట్‌లుక్‌ లిప్‌లాక్‌ను చూసి కాస్త నిరుత్సాహపడుతున్నారనేది వాస్తవం. అయినా బుల్లితెర మీద కూడా ఇలాంటి శృంగార సన్నివేశాలు, పొట్టి పొట్టి కాస్ట్యూమ్స్‌, డబుల్‌ మీనింగ్‌లు ఎక్కువవుతుండటంతో సినిమాలలో ఇవి మరింత సహజమని కొందరు వాదిస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs