Advertisement
Google Ads BL

హాట్‌ హాట్‌గా రెచ్చిపోతున్న అమల..!


కేరళకుట్టి అమలాపాల్‌ ఈమధ్య తరచుగా వార్తల్లో ఉంటోంది. కెరీర్‌ మంచి పొజిషన్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ని పెళ్లాడింది. కానీ ఈ బంధం రెండేళ్లలోపే ముగిసిపోయింది. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కాగా దీనికి ధనుష్‌తో ఎఫైర్సే కారణమంటూ పలువార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా పెళ్లయినప్పుడు నిండుగా కనిపించిన అమలా.. ప్రస్తుతం స్వేచ్చాజీవి కావడం, మరోవైపు అవకాశాలు కూడా ఆమెను వెత్తుకుంటూ వస్తుండటంతో ఈమె తన గ్లామర్‌షోకు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇటీవల కొన్ని పార్టీలు, ఫొటో షూట్స్‌లో ఆమె గ్లామర్‌డోస్‌ పెంచి, యువత మతిని పోగొడుతుండటమే కాదు.. దీని ద్వారా దర్శకనిర్మాతలను, హీరోలను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. 

Advertisement
CJ Advs

ధనుష్‌తో 'వడచెన్నై'తో పాటు 'విఐపి2' కూడా నటిస్తున్న ఆమె ధనుష్‌ నిర్మాతగా రంజిత్‌పా దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా నటించే చిత్రంలో అవకాశం కూడా పొందింది. కాగా ఆమె ప్రస్తుతం కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌ సరసన 'హెబ్బుల్‌' చిత్రంలో నటిస్తోంది. ఇందులోని స్టిల్స్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా తాజాగా విడుదలైంది. దీనిలో అమలా గ్లామర్‌షో ఇప్పుడు సౌత్‌ఇండియాలో హాట్‌టాపిక్‌ అయింది. ఆమె వేసుకొన్న కాస్ట్యూమ్స్‌ నుంచి అందాల ప్రదర్శన దాకా ఆమె లుక్‌ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని చిత్రాలలో అవకాశం రావడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs