Advertisement
Google Ads BL

నారా రోహిత్‌ కి..మాంచి ఊపునిచ్చింది..!


ఈ ఏడాది ఇప్పటికే వరుసగా 'తుంటరి, సావిత్రి, రాజా చేయి వేస్తే, శంకర, జ్యో అచ్యుతానంద' చిత్రాలను విడుదల చేసిన విభిన్న చిత్రాల హీరో నారా రోహిత్‌కు 'జ్యోఅచ్యుతానంద' చిత్రం మంచి ఫలితాన్ని అందించింది. తాజాగా విడుదలైన ఆయన సొంతబేనర్‌లో రూపొందిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను, విమర్శకుల ప్రశంసలతో పాటు రివ్యూలలో కూడా మంచి రేటింగ్‌ సాధించి ఆయనకు పెద్ద హిట్‌ను ఇచ్చేలా ముందుకు సాగుతోంది. ఈచిత్రంలో రోహిత్‌, శ్రీవిష్ణుల నటనకు ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి ఎంతగానో ఎదురుచూసిన బ్రేక్‌ తనకు ఈ చిత్రం ద్వారా వచ్చిందనే సంతోషంతో నారా వారబ్బాయి ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఆయన సొంతబేనర్‌ అయిన అరన్‌ మీడియా వర్క్స్‌ బేనర్‌లో నిర్మించిన నారారోహిత్‌ ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇక నుండి తన సొంతబేనర్‌లో ఏడాదికి మూడు చిత్రాలకు తగ్గకుండా విభిన్న చిత్రాలను నిర్మిస్తానని హామీ ఇస్తున్నాడు. మొత్తానికి నటునిగానే కాకుండా నిర్మాతగా కూడా నారా రోహిత్‌ కు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భావించాలి. 

Advertisement
CJ Advs

Click Here for Appatlo Okadundevadu Review

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs