Advertisement
Google Ads BL

బాలయ్య.. ఇదేం గోలయ్యా..!


నందమూరి బాలకృష్ణ.. భోళాశంరుడని, పొగడ్తలకు, సెంటిమెంట్లకు ఫ్లాటైపోతాడనే పేరుంది. కాగా ఆయన దర్శకులు ఏదైనా పవర్‌ఫుల్‌ టైటిల్‌ను చెప్పి, ఆయన పాత్ర ఎంత వీరోచితంగా ఉంటుందో చెబుతూ, ఓ నాలుగైదు అదిరిపోయే డైలాగ్స్‌ను చెప్పేస్తే.. ఇక వారి ట్రాక్‌ రికార్డు గురించి ఆలోచించకుండా సినిమా ఒప్పుకుంటాడనే విమర్శ కూడా ఉంది. వైవిధ్యభరితమైన 'భైరవద్వీపం, ఆదిత్య369, శ్రీకృష్ణార్జునవిజయం' ఇలా ఆయన పలు అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించాడు. కానీ దర్శకుల విషయంలో మాత్రం ఆయనకు సరైన నిర్ణయాలు తీసుకోలేడని కూడా చెడ్డ పేరు ఉంది. 

Advertisement
CJ Advs

తనకు నచ్చితే చాలు.. ఇక ఆ సినిమాను వెంటనే ట్రాక్‌ ఎక్కించడం కొత్త విషయమేమీ కాదు.. కాగా ఆయన కొత్తవారైన సహదేవ్‌, మహాదేవ్‌ వంటి దర్శకులతో పాటు ఫేడవుట్‌ అయిన రవిచావలి, పరుచూరి మురళీ వంటి వారికి కూడా అవకాశాలు ఇచ్చి దెబ్బతిన్నాడు. ఇక అప్పట్లో పెద్ద హీరోలను హ్యాండిల్‌ చేయడం చేతకాని ఎస్వీకృష్ణారెడ్డికి 'టాప్‌ హీరో'తో అవకాశం ఇచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తన వందో చిత్రం కోసం కూడా బోయపాటి వంటి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌ను కాదని, ఇప్పటివరకు కమర్షియల్‌హిట్‌ లేని క్రిష్‌కు అవకాశం ఇచ్చాడు. కాగా ఆయన ఎంతో కొంత క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరున్నప్పటికీ ఈమధ్యకాలంలో రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన కృష్ణవంశీతో తన 101వ చిత్రంగా 'రైతు' చిత్రం చేస్తానని తెలిపాడు. 

కానీ ఈ చిత్రాన్ని అమితాబ్‌ కారణంగా హోల్డ్‌లో ఉంచాడని, తన 101వ చిత్రానికి దర్శకునిగా మరోసారి ఫేడవుట్‌ అయిన దర్శకుడు, తనకు 'టాప్‌ హీరో' వంటి డిజాస్టర్‌ను ఇచ్చిన ఎస్వీకృష్ణారెడ్డితో చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఫేడవుట్‌ అయిన ఎస్వీ చెప్పిన కథ బాలయ్యకు బాగా కనెక్ట్‌ కావడంతోనే ఆయనకు ఈ అవకాశం ఇచ్చాడంటున్నారు. కాగా ఎస్వీ ఫేడవుట్‌ అయి చాలా కాలం అయింది. ఇటీవల ఆయన చాలా గ్యాప్‌ తర్వాత తీసిన 'యమలీల2' చిత్రం చూసిన ప్రేక్షకులు తలలు బాదుకున్నారు. మరి బాలయ్య తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఆయన వీరాభిమానులకు తీవ్ర మనస్థాపానికే గురిచేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరోపక్క చిరు మాత్రం వినాయక్‌, సురేందర్‌రెడ్డి వంటి దర్శకులతో సేఫ్‌ గేమ్‌ ఆడుతుండగా, బాలయ్య మాత్రం కాస్త తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs