Advertisement
Google Ads BL

నిజమైన కారణం ఇదేనా తల్లీ..!


కోలీవుడ్ హీరోయిన్, మలయాళ భామ అమలా పాల్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ జీవితంలో చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది. పలు సినిమాలు చేతిలో ఉండగానే డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడి అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ చాలా గ్రాండ్ గా పెళ్లికూడా చేసుకున్నారు. ఇక వీరు రెండేళ్ల కాపురంలో విభేదాల కారణంగా విడాకులు తీసుకునే వరకు పరిస్థితిని తెచ్చుకున్నారు. అయితే అమలా పాల్ పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీ కావాలనుకునే భర్తకు విడకులిచ్చిందని ఒక వైపు, అత్తమామలతో కలహాల కారణంగా భర్తతో విడిపోయిందని మరో వైపు రక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏది  ఏమైనా అమల భర్త నుండి విడాకులకు అప్లై చేసాక ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ తారగా మారిపోయింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అమల పాల్ తమిళంలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తూ క్షణం ఖాళీ లేకుండా బిజీ బిజీ అయిపొయింది. అయితే అమలా పాల్ తన భర్త నుండి విడిపోవడానికి పైన చెప్పిన కారణాలేమీ కాదట. అమలా విడాకుల వ్యవహారంలో ఇప్పుడు మరో వార్త కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే అమల భర్త విజయ్ నుండి విడిపోవడానికి కారణం రజినీకాంత్ అల్లుడు ధనుష్ అంట. రజినీకాంత్ అల్లుడు ధనుష్ కూడా కోలీవుడ్ టాప్ హీరో. అమలా, ధనుష్ ల మధ్యన ప్రేమాయణం నడుస్తుందని, అతనితో ఎఫ్ఫైర్ కారణంగానే అమల భర్తకి విడకులిచ్చిందని అబ్బో ఇలా రక రకాలుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

అయితే ఇలా వార్తలు రావడానికి కారణం కూడా చెబుతున్నారు. అమలా పాల్ విడాకుల వ్యవహారం ముందు, వెనుక వరసబెట్టి ధనుష్ సినిమల్లో హీరోయిన్ గా నటించడం వల్లే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి అంటున్నారు. ఇక విఐపి సినిమాలో 'ధనుష్' తో నటించిన అమలకు ఇప్పుడు ధనుష్ కి జోడిగా 'విఐపి 2 ' లో కూడా ఛాన్స్ వచ్చిందని... అయితే ఈ ఛాన్స్ అమలకు ఇవ్వొద్దని అమల పాల్ మాజీ భర్త విజయ్ కుటుంబం ధనుష్ ని కోరినట్లు చెబుతున్నారు. ఇక ధనుష్ వారి మాటలను పట్టించుకోకుండా అమలకే ఆ అవకాశం ఇవ్వడం వల్ల వీరి మధ్యన ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.

మరి ఈ వార్తలు చూసిన అమలా పాల్ కోలీవుడ్ మీడియా పై గుర్రుగా ఉందని.... ఒక పెళ్ళైన వాడితో ఇలా నీచమైన సంబంధం అంటగట్టడం కరెక్ట్ కాదని....ధనుష్ తన శ్రేయోభిలాషని, తన కాపురం నిలబెట్టడానికి ధనుష్ ఎంతో హెల్ప్ చేసాడని ... అలాంటి  మంచి మనిషి గురించి ఇలా నీచంగా వార్తలు ప్రచురించడం తప్పని మండిపడుతుంది. మరి భర్తతో విడాకులు తీసుకున్నాక అమలా పాల్ గురించి ప్రతి చిన్న విషయాన్ని మీడియా బూతద్ధంలోనే చూస్తుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs