Advertisement
Google Ads BL

ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా...?


ఒక హీరో, హీరోయిన్ మీద అభిమానం చూపించడం ఫ్యాన్స్ కి చాలా సహజం. ఇక వీరి అభిమానం ఒక్కోసారి మంచి పనులు చేస్తూ మిగతావారికి ఆదర్శం గా నిలుస్తుంది. ఆయా హీరోల అభిమానులు తమ హీరో గారి పుట్టినరోజు వేడుకలకి రక్తదానం, అన్నదానం చేస్తూ వుంటారు. అయితే కొన్నిసార్లు ఆ అభిమానం వెర్రితలలు వేస్తూ ఉంటుంది. కొంతమంది తమకు నచ్చిన, అభిమానించిన వారిపై విపరీతమైన అభిమానం చూపించడం కోసం చావు అంచుల వరకు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. అలాంటి అభిమానులు చాలామందే వున్నారు. ఉదాహరణకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ అప్పుడు తొక్కుకుని ఒక అభిమాని మరణానికి కారణమయ్యారు. మొన్నామధ్యన పవన్ మీద అభిమానంతో ఒక అభిమాని బిల్డింగ్ మీద నుండి జారిపడి మరణించాడు. ఇక ఎవరైనా హీరోగారి సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు తమ పనులు వదిలేసి ఆ హీరోగారి బ్యానర్లు కట్టడానికి ప్రాణాలకు తెగించేస్తుంటారు. ఇలా కరెంట్ తీగలు ఆనుకుని షాక్ కొట్టి చాలామంది అభిమానులు చనిపోయిన సందర్భాలు కోకొల్లలు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఇదంతా.. ఎందుకంటే 'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్ కి ఒక అభిమాని వీరాభిమానంతో రక్తంతో ప్రేమ లేఖని రాసాడు. తన ప్రేమ, అభిమానం అన్ని కలిపి వ్యక్తం చేస్తున్నట్టు ఆ లేఖను గాఢంగా రక్తంతో రాసి పడేసాడు. మరి ఆ లెటర్ చూసిన సీరత్ ఖంగు తిని ఒక్కసారే షాక్ అయినంత పనిచేసిందట. ఆ అభిమాని చేసిన పనికి ఎంతో బాధపడి... దయచేసి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని తన అభిమానులకి ట్విట్టర్ ద్వారా తెలియజేసిందట. ఇక సీరత్ ట్వీట్ చూసిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిందట. ఇది చాలా దారుణం. ప్రతి వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. జీవితం చాలా విలువైనది అంటూ రీ ట్వీట్ కూడా చేసింది.

మరి అభిమానులు ఇలా తమ అభిమాన సెలెబ్రిటీ లను ఇబ్బంది పెట్టడం ఎంతవకు కరెక్ట్... అసలిదంతా ఆ అభిమాని కావాలని చేశాడా... లేక ఏదన్నా ఆటపట్టించడానికి చేశాడా.. అనేది తెలియాల్సి వుంది. ఏదైనా అభిమానులు తమ అభిమానాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs