పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' కి సంబంధించి హ్యాపీ న్యూ ఇయర్ పోస్టర్స్ అంటూ.. ఒక్కో పోస్టర్ ని విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. ఇక పోస్టర్ 1 లో పవన్ కళ్యాణ్ కాళ్ళని మాత్రమే సైడ్ నుండి చూపిస్తూ హైప్ క్రియేట్ చేశారు. ఇక ఆ పోస్టర్లో పవన్ ఫేస్ ని కూడా చూపిస్తే చాలా బావుండేదని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ మూడు రోజులు 'కాటమరాయుడు' పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని.... న్యూ ఇయర్ రోజున 'కాటమరాయుడు' టీజర్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక కాళ్లను సైడ్ నుండి చూపించిన పోస్టర్ 1 తో ట్రెండ్ క్రియేట్ చేసాడు పవన్ కళ్యాణ్. తాజాగా విడుదల చేసిన పోస్టర్ 2 లో కూడా పవన్ వెనుక భాగం లోని కాళ్ళని మాత్రమే చూపించారు. పవన్ నడుము వరకే ఉన్న భాగం తో పంచె కట్టులో పంచె పైకి ఎత్తుకుని నడుస్తూ వెళుతున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ 2 లో అయినా పవన్ లుక్ ని చూసి తరించాలనుకున్న పవన్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. అయినా మరీ ఇంత సీక్రెట్ గా పవన్ లుక్ ని రివీల్ చేస్తున్నారెందుకో?. అలా అయితే సినిమా మీద భారీ అంచనాలు పెంచొచ్చని చిత్ర యూనిట్ తో పాటు డైరెక్టర్ డాలి భావిస్తున్నాడేమో? అయినా పవన్ కళ్యాణ్ చెప్పులు చూసినా పిచ్చెక్కిపోయి పండగ చేసుకునే ఫ్యాన్స్ ఉండగా ఇలాంటి పోస్టర్స్ కి వారి నుండి మంచి ఆదరణే ఉంటుంది మరి. ఇక వచ్చే పోస్టర్స్ లోనైనా పవన్ ఫేసుని రివీల్ చేస్తారో? లేదో..అని పవన్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.