సెక్స్‌బాంబ్‌ అంత డిమాండ్‌ చేస్తోందా..?


సల్మాన్‌ఖాన్‌ సోదరుడు, బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అర్భాజ్‌ఖాన్‌కు బాలీవుడ్‌ సెక్స్‌బాంబ్‌ మలైకా అరోరాలకు 17ఏళ్ల కిందట వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. ఇద్దరు విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా వారిద్దరికి కౌన్సిలింగ్‌ కూడా నిర్వహించారు. అయినా కూడా ఇద్దరు విడిపోవాలనే నిర్ణయించుకున్నారు. కానీ అర్భాజ్‌ఖాన్‌ మాత్రం తన సోదరుడు సల్మాన్‌తో పాటు కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల మరలా కలిసి జీవించేందుకు అంగీకరించినప్పటికీ మలైకా మాత్రం నో చెప్పిందట. 

వీరిద్దరికి అర్హన్‌ఖాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కాగా తమ కుమారుడి ఆలనాపాలనా మాత్రం వీరిద్దరు కలిసి చూసుకుంటున్నారు. అందుకే ఈమధ్యన కొన్ని వేడుకల్లో కూడా కలిసి కనిపించారు. కాగా ఈ విడాకులకు కోర్టు దాకా పోకుండా బయటే సెటిల్‌మెంట్‌ చేయాలని అర్బాజ్‌ఖాన్‌ ప్రయత్నిస్తుండగా, విడాకుల సెటిల్‌మెంట్‌ కోసం మలైకా ఏకంగా 15కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. దానికి కూడా అర్బాజ్‌ రెడీ అయ్యాడు. వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత వీరు విడివిడిగా తమ భాగస్వాములను ఎంచుకున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. 

మలైకా హీరో అర్జున్‌కపూర్‌తో సన్నిహితంగా ఉంటుంటే, అర్బాజ్‌ గోవాకు చెందిన రెస్టారెంట్‌ ఓనర్‌ ఎల్లో మెహ్రాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడట. కాగా అర్జున్‌కపూర్‌తో తాను కలిసి ఉంటునానన్న విషయాలను తాజాగా మలైకా ఖండించింది. ఇక ఖండించకపోతే లాభం లేదనుకుందేమో గానీ, ఆమె మీడియా ముందుకు వచ్చి తాను, అర్జున్‌కపూర్‌లం కేవలం మంచి స్నేహితులమేకానీ తమ మధ్య అంతకు మించి ఏమీ లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మొత్తానికి మలైకా విడాకుల పరిహారం 15కోట్లు అనే మాట మాత్రం బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయింది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES