Advertisement

ఆసక్తిని రేపుతోన్న నారా చిత్రం..!


నారా రోహిత్‌ సమర్పణలో, ఆయనే హీరోగా, శ్రీవిష్ణు మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒక్కడుండేవాడు'చిత్రం రేపు విడుదల కానుంది. వాస్తవిక సంఘటనలు, పాత్రల స్ఫూర్తితో ఈ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రాన్నే 'అయ్యారే....' వంటి టిపికన్‌, నేచురల్‌ సబ్జెక్ట్‌తో సంచలనం సృష్టించిన సాగర్‌ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇందులో ఇంతియాజ్‌ అనే పోలీసాఫీసర్‌ పాత్రలో రోహిత్‌, క్రికెటర్‌ రాజు పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధుర్యోధనుని పాత్రను పోలిన పాత్రను నారా రోహిత్‌, కర్ణుడిలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నా ఎక్కడో తేడా అనిపించే కర్ణుడి తరహా పాత్రలో శ్రీవిష్ణు నటించారని దర్శకుడు చెబుతున్నాడు. అయితే పురాణంలో వీరిద్దరు స్నేహితులైతే, ఈ చిత్రంలో మాత్రం ఇద్దరు విరోధులుగా కనిపించనున్నారట. 

Advertisement

ఇక ఈ చిత్రంలో పలు వాస్తవిక సంఘటనలు చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్‌ నయూమ్‌, ఆయన హత్య చేశాడని భావిస్తున్న ప్రజాగాయని లలితక్కల పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయని సమాచారం. అలాగే రెండు దశాబ్దాల కిందట తెల్గీ చేసిన స్టాంపుల కుంభకోణం, భోగాపురం దొంగల నిజజీవితాలు, వారి వెనుక ఉండే రాజకీయనాయకులు, క్రికెటర్‌గా బాగా ఎదుగుతాడనుకున్న ఓ హైదరాబాదీ క్రికెటర్‌ కెరీర్‌ నాశనం కావడానికి కారణాలు, 1990లలో ఓ మాజీ ముఖ్యమంత్రి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మతాల మధ్య గొడవలు పెట్టిన వైనం.. ఇలా పలు వాస్తవ ఘటనలకు ఇందులో తెరతీశారని తెలుస్తోంది. ఇవే నిజమైతే ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement