Advertisement
Google Ads BL

పవన్‌ హీరోయిన్‌ వ్యాఖ్యలపై రచ్చ..!


పవన్‌కళ్యాణ్‌-ఎస్‌.జె.సూర్యల కాంబినేషన్‌లో 'ఖుషీ' తర్వాత వచ్చిన చిత్రం 'కొమరం పులి'.కాగా ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ నికిషాపటేల్‌. ఈ చిత్రంతో ఆమె దశ తిరుగుతుందని అందరూ భావించారు. కానీ ఈ చిత్రమే తన కొంపముంచిదంటూ నికిషా ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అసలు ప్రాంతీయభాషల్లో నటించాలనే ఉద్దేశ్యం లేదు. కానీ మోడలింగ్‌ రంగంలో ఉన్నప్పటి నుంచి నాకు సూర్యతో పరిచయం ఉంది. దాంతో ఆయన బలవంతం మీద ఆ చిత్రం చేశాను. వాస్తవానికి నేను బాలీవుడ్‌ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయాలని భావించాను.కానీ 'కొమరం పులి' నా ఆశలను నీరుగార్చింది.వాస్తవానికి లండన్‌లో ఉండే నాకు పవన్‌ అంటే ఎవరో కూడా తెలియదు. 

Advertisement
CJ Advs

కానీ ఆ తర్వాత ఆయన ఇమేజ్‌ గురించి తెలుసుకున్నానంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ చిత్రం తర్వాత తనకు అవకాశాలు రాలేదని, ప్రస్తుతం అవకాశాలు వస్తున్నాయంటోంది. మరి ప్రాంతీయభాషలంటే పడని ఆమె ఇప్పుడు తెలుగులో కూడా చిన్నచితకా చిత్రాలు ఎందుకు చేయాలి? ఆ పనేదో బాలీవుడ్‌కి వెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు కదా...! అని కొందరు విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం మంచి దర్శకులు లేరని, అందువల్ల వారి వల్ల ఆర్టిస్టుల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ మరో రెచ్చగొట్టే వ్యాఖ్య చేసింది. పెళ్లి గురించి మాట్లాడుతూ, మగా ఆడా కలిసి బతకాలంటే పెళ్లి అవసరం లేదని, వైవాహిక జీవితం చేస్తున్న వారందరు సంతోషంగా లేరని, 2030 కల్లా ఇండియాలో కూడా సహజీవనం విస్తరిస్తుందని, తాను కూడా సహజీవనమే చేయనున్నానని తెలిపింది. మొత్తానికి ఆమె వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ, రచ్చ జరుగుతోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs