Advertisement
Google Ads BL

అబ్బాయ్‌లు తగ్గినా... బాబాయ్‌ తగ్గడంట..!


నందమూరి బాలకృష్ణ కుటుంబానికి, నందమూరి హరికృష్ణ కుటుంబానికి అసలు పడటం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హరికృష్ణ తనయులైన జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు మాత్రం బాబాయ్‌ బాలయ్యతో కలిసి పోవాలని ప్రయత్నిస్తున్నా... బాలయ్య మాత్రం తగ్గనంటున్నాడే వార్తలు ఇప్పుడు మరింత బలపఢ్డాయి. బాలయ్య నటిస్తున్న 100వచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ చూసిన అనంతరం ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు అదరహో బాబాయ్‌ అంటూ బాలయ్యపై దర్శకుడు క్రిష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ బాలయ్య మాత్రం వాటికి కనీసం స్పందించను కూడా లేదు. ఈ చిత్రం ఆడియో వేడుకకు వందమంది విశిష్ట అతిథులకు డిజిటల్‌ ఇన్విటేషన్స్‌ ఇచ్చారు. కానీ అబ్బాయ్‌లకుగానీ, అన్నయ్య హరికృష్ణకు గానీ ఆహ్వానం అందించలేదని తెలుస్తోంది. వాస్తవానికి తాను నటించిన 'డిక్టేటర్‌'కు పోటీగా, ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని విడుదల చేశాడు. దాంతో ఈ చిత్రానికి థియేటర్లను దక్కకుండా చేయడానికి బాలయ్యతో పాటు పలువురు టిడిపి పెద్దలు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇద్దరికి చాలా సన్నిహితుడైన ఓ సీనియర్‌ నటుడు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించాడని, తానే పక్కనుండి ఎన్టీఆర్‌ చేత బాలయ్యకు ఫోన్‌ చేయించి క్షమాపణలు కూడా చెప్పించాడట. దాంతో బాలయ్య దానికి స్పందించి ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ఆడియో వేడుకకు వస్తానని చెప్పి కూడా చివరిక్షణంలో రాలేదని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
CJ Advs

ఇక 'జనతాగ్యారేజ్‌' టైంలో కూడా బెనిఫిట్‌షోలకు అనుమతిని నిరాకరించడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో జూనియర్‌ ఫ్యాన్స్‌ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని పలువురు టిడిపి నాయకులను కలిసి హెచ్చరించారు. చివరి క్షణంలో చంద్రబాబు జోక్యం చేసుకొని, ఈ విధంగా బెనిఫిట్‌ షోలను ఆపేస్తే జూనియర్‌ ఫ్యాన్స్‌ బాలయ్య, లోకేష్‌లను తప్పుపడతారని భావించి, బాలయ్యకు నచ్చజెప్పి, చివరిక్షణంలో బెనిఫిట్‌షోలకు అనుమతినిచ్చారని జూనియర్‌ ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. ఇక తమ అన్నయ్య స్వర్గీయ జానకీరాం కుమారుల పంచెకట్టు వేడుకకు హాజరైన ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకకు రాకపోవడానికి కారణం వారికి ఆహ్వానాలు అందకపోవడమే కారణం అంటున్నారు. ఆమద్య జరిగిన 'అమరావతి' శంకుస్థాపనకు లక్షన్నర ఇన్విటేషన్లను ముద్రించి అందరినీ ఆహ్వానించినా జూనియర్‌కు గానీ, కళ్యాణ్‌రామ్‌కు గానీ ఆహ్వానాలు అందలేదనేది వాస్తవం అని తెలుస్తోంది. ఇవ్వన్నీ చూస్తుంటే చంద్రబాబే వీరి మధ్య సంబంధాలను చెడగొడుతున్నాడని, లోకేష్‌ కోసమే ఇదంతా చేస్తున్నాడని, అన్ని తెలిసిన బాలయ్య కూడా తన అల్లుడి కోసం మౌనం పాటిస్తున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs