Advertisement
Google Ads BL

నాగ్‌ ఎంతో పట్టుదలగా ఉన్నాడట..!


త్వరలో నాగార్జున తనయులైన నాగచైతన్య, అఖిల్‌లకు పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అఖిల్‌ నిశ్చితార్ధం ఇప్పటికే పూర్తికాగా, చైతూ, సమంతల ఎంగేజ్‌మెంట్‌ను జనవరి నెలాఖరులో చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆమధ్య చైతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను,సమంతలు పెళ్లి చేసుకోనున్నామని తెలిపి, తమకంటే అఖిల్‌ పెళ్లి ముందుగానే జరుగుతుందని స్పష్టంచేశాడు. కానీ నాగ్‌ మాత్రం ప్రస్తుతం పెద్దవాడైన చైతూకు ముందు పెళ్లి చేసి,ఆ తర్వాతనే తన చిన్నకొడుకు అఖిల్‌ వివాహాన్ని చేయాలనే పట్టుదలతో ఉన్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

ముందుగా చిన్నవాడికి పెళ్లి చేసి, నిదానంగా పెద్దవాడికి పెళ్లి చేస్తే అనవసరపు ప్రచారం మొదలవుతుందనే ఉద్దేశ్యంతో నాగ్‌ ఉన్నాడట. కాగా అఖిల్‌-శ్రేయాభూపాల్‌ల పెళ్లి మేనెలలో ఇటలీలో గ్రాండ్‌గా చేయనున్నారు. అదే సమయంలో చైతూ, సమంతల పెళ్లిని అంతకు నెల ముందుగానే అంతే ఘనంగా చేయాలనే పట్టుదలతో నాగ్‌ ఉన్నాడని, ఈ విషయంలో చైతూ నిర్ణయం కీలకం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క తమిళంలో తనకు వస్తున్న చాన్స్‌లను సమంత ఎంచుకుంటూనే ఉంది. పెళ్లి లేటుగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆలా చేస్తోందని, నాగ్‌ పట్టుదలకు సమంత కూడా ఓ కారణమని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs