Advertisement
Google Ads BL

కరణ్ తో కాఫీ కి వెళ్లి..భలే బుక్ చేశారు..!


బాలీవుడ్ లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్  ‘కాఫీ విత్ కరణ్’ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ ని  ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం కి ఆహ్వానించి వారి పర్సనల్ విషయాలను సైతం ఈ కార్యక్రమం లో బయటకి లాగేస్తుంటాడు కరణ్ జోహార్.  అయితే కొంతమంది వ్యక్తిగత విషయాలను చెప్పేటప్పుడు తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరి కొంతమంది ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఇక తాజాగా ఈ  ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం కి బాలీవుడ్ హీరోయిన్స్ అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు అటెండ్ అయ్యారు. వీరిద్దరిపై కరణ్ తన ప్రశ్నల వర్షం మొదలు పెట్టాడు.

Advertisement
CJ Advs

కత్రినా కైఫ్ ని నిన్నెవరన్నా చీట్ చేశారా.. అని అడిగిన ప్రశ్న కి కత్రినా రిలేషన్ షిప్ లో అపశ్రుతులు..చేదు అనుభవాలు..ఛీటింగులు సాధారణమే అని చెప్పింది. ఇంకా రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయినప్పుడు బాధనిపించలేదా అని అడగగా...కాస్త వంకరగా స్పందించిన కత్రినా మనము ఒక భీకర తుఫానులో చిక్కుకున్నప్పుడు... వాతావరణ హెచ్చరిక చేసినప్పుడు మనము పట్టించుకుంటామా.. లేదుకదా. తుఫానులో చిక్కుకుని బాధపడిన వారికే ఆ బాధ విలువ తెలుస్తుంది.. అని అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చింది. ఇంతకుమునుపే కత్రినా రణబీర్ విషయం లో మోసపోయినప్పుడు...  ఛీటర్లు ఎప్పుడైనా..ఎక్కడైనా ఛీట్ చేస్తారు అంటూ బాధని వ్యక్తం చేసింది.

ఇక మరో వైపు అనుష్క శర్మ కూడా ఈ షో లో కరణ్ జోహార్ కి గట్టిగా వార్నింగ్ లాంటిది ఇచ్చిందట. ఈ ‘కాఫీ విత్ కరణ్' లో కత్రినాతో పాటు అనుష్క కూడా హాజరైంది. ఇక అనుష్క శర్మతో తాను లవ్ లో పడిపోయానని అందుకే ‘యే దిల్ హై ముష్కిల్’  సినిమాని కూడా తీశానని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. ఇది విన్న అనుష్క శర్మ అందుకేనా నన్ను షూటింగ్ టైమ్ లో అసభ్యకరంగా తాకావంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక వీరి వాదనలో కల్పించుకున్న కత్రినా నిన్ను యాక్టివ్ గా చెయ్యడానికే కరణ్ అలా చేసుంటాడని అనుష్కని సముదాయించింది. అయినా కూడా కూల్ కానీ అనుష్క.. కరణ్ ని ఉద్దేశించి ఇంతకుమునుపు జాక్వెలిన్ కూడా నీపై అరోపణలు చేసింది. మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో ఆమెను కూడా అసభ్యంగా తాకావంట... అని అంటూ కరణ్ పై అనుష్క ఒక లెవెల్లో ఫైర్ అయ్యింది. ఇదంతా చూస్తుంటే అనుష్క కి కరణ్ జోహార్ మీద నిజంగానే ఒళ్ళుమండిందా? లేక ఇదంతా సరదాగా జరిగిందా? అని బాలీవుడ్ లో ఒకటే చర్చ జరుగుతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs