Advertisement
Google Ads BL

సలోని అందుకు సిగ్నల్ ఇచ్చేసింది..!


'ఒక ఊరిలో' చిత్రంతో టాలీవుడ్‌ లో నటిగా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్‌ సలోని. ఆ తర్వాత ఆమెకు రాజమౌళి 'మగధీర' చిత్రంలో శ్రీహరితో డ్యాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరలా జక్కన్న దయతోనే 'మర్యాదరామన్న' చిత్రంలో సునీల్‌కు జోడీగా నటించింది. కానీ ఆ అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజాగా ఆమె 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రంలో థర్టీ ఇయర్స్‌ పృథ్వీ సరసన నటించింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది. వరసగా చిత్రాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ సరైన అవకాశాలు రావడం లేదు.దాంతో గత రెండు మూడేళ్లుగా తమిళ, కన్నడ భాషలపై దృష్టిపెట్టాను. నేను హిందీలో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించాను. ఇక తెలుగులో కూడా బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి అగ్రహీరోలతో కలిసి పనిచేశాను. కానీ నాకు టైమ్‌ కలిసిరాలేదు. ఇక స్వతహాగా నాకు కామెడీ విత్‌ రొమాన్స్‌ చిత్రాలంటే ఇష్టం. అందువల్ల కమెడియన్ల సరసన కూడా చేస్తున్నాను. కమెడియన్ల చిత్రాలైతే ఇలా చేయాలి? స్టార్‌హీరోల చిత్రాలైతే ఇలా చేయాలి? అనే రూలేం లేదు కదా..! ఎవరితో చేసినా క్యారెక్టర్‌కు, కథకు తగ్గట్లుగా నటించడం మాత్రమే నాకు తెలుసు. 

Advertisement
CJ Advs

ఇక కమెడియన్లతో నటిస్తున్నప్పుడు సెట్లోనే ఎంతో ఎంజాయ్‌ చేస్తాను. వారితో నటిస్తుంటే అసలు పనిచేస్తున్న భావనే రాదు. అందుకే నా దృష్టిలో కమెడియన్లే నిజమైన హీరోలు. ఇక నాకు డ్యాన్స్‌ల్లో ఆడిపాడటం అంటే చాలా ఇష్టం. రామ్‌చరణ్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌ వంటి వారి సరసన డ్యాన్స్‌ చేయాలని ఉంది. వారితోనే కాదు.. మంచి పాట అనిపిస్తే స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి కూడా నేను రెడీ. ఈమధ్య చాలా హర్రర్‌ చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ వాటిల్లో నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను. అలా నేను రిజెక్ట్‌ చేసిన కొన్ని హర్రర్‌ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇకపై మంచి హర్రర్‌ కథలు వస్తే చేస్తాను... అంటూ హర్రర్‌చిత్రాల దర్శకనిర్మాతలకు, స్పెషల్‌సాంగ్స్‌ అవకాశాల కోసం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ మాట్లాడింది. మరి సిగ్నల్ ఇచ్చేసిందిగా...ఇక ఇండస్ట్రీ ఏ రకంగా వాడతారో చూద్దాం..!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs