Advertisement

నిగర్వినని మరోసారి చాటుకున్న బాద్‌షా..!


ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో బాలీవుడ్‌ బాద్‌షా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమితాబ్‌, షారుఖ్‌ వంటి వారు తమకు ఎన్ని గౌరవాలు, పద్మ వంటి అవార్డులు వచ్చినా ఉప్పొంగరు. ఒకానొక సందర్భంగా షారుక్‌కు భారత ప్రభుత్వం మంచి అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా షార్‌ఖ్‌ మాట్లాడుతూ, నేను ఇందులో చేసింది ఏమీ లేదు.దేశానికి నేనేమీ చేయలేదు. కేవలం డబ్బులు తీసుకొని సినిమాలలో నటిస్తున్నాను. కాబట్టి ఇందులో నేను చేసిన సేవ ఏముంది? అంటూ మాట్లాడారు. ఇలాగే తాజాగా షారుక్‌ మరోసారి తానెంత నిగర్వినో హైదరాబాద్‌ సాక్షిగా చాటిచెప్పాడు. తాజాగా ఆయనకు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఈ సందర్భంగా షారుఖ్‌ మాట్లాడుతూ, నాకు డాక్టరేట్‌ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. 

Advertisement

కానీ నేను దీనికి అర్హుడినో కాదో నాకు తెలియదు.. అని మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, మా అమ్మ హైదరాబాదీ, నాన్న ఉర్ధూపండితుడు. దేశంలో ఉర్దూ భాషాభివృద్దికి నా వంతు సాయం అందిస్తానని ప్రకటించాడు. టైప్‌రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టం. జీవితం కూడా అంతే. అందుకే ఏదైనా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తప్పుచేసి సరిదిద్దుకోవడం కంటే... ఆ తప్పులు జరగకుండా ముందుగానే జాగ్రత్తపడటం మంచిదని విద్యార్ధులకు సలహా ఇచ్చారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే తమకొచ్చిన బిరుదులు, పురస్కారాలను చూసి తామేదో సాధించేశామని భావిస్తూ, తాము లెజెండ్స్‌ ఎందుకు కాదో చెప్పాలని కొందరు కింగ్స్‌, అభిమానులను రెచ్చగొట్టే పేరుతో అందరితో కుమ్మక్కై డాక్టరేట్‌లను కొనుగోలు చేసేవారు, తమకున్న పలుకుబడితో పైకొదిగేవారు, రాజ్యసభలకు ఎంపికైన పలువురు రత్నలు, స్టార్స్‌.. వారసులు తమంతట తామే అభిమానుల చేత బిరుదులు పెట్టించుకునే వారు.. షారుఖ్‌, అమితాబ్‌ వంటి వారిని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement