తనకు సినిమా వాళ్ల సంగతి తెలుసు కానీ, సినిమాల గురించి తెలియదని..సినిమా వాళ్ల సంగతి అంటే, వారి గురించి తెలుసు అంతే అంటూ కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారు బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేదిక సాక్షిగా తెలిపారు. చంద్రబాబు ఈ సినిమా ఫంక్షన్‌కు రావడానికి.. బాలయ్యకు వియ్యంకుడు కావడం కారణం కావొచ్చేమో...కానీ, నేను సినిమాకి సంబంధించిన శాఖ కి కూడా మినిస్టర్ కావడం వల్లనూ, ఇంకా ఓ గొప్ప తెలుగు వ్యక్తి అయిన శాతకర్ణి గురించి సినిమా కాబట్టే... బాలకృష్ణ అడగగానే ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్లు వెంకయ్య అన్నారు. ఇంకా శాతకర్ణి గురించి, అలనాటి ఎన్టీఆర్ గురించి, హేమమాలిని గురించి..సుమ గురించి స్పీచ్ దంచేసిన వెంకయ్య..బాలయ్యని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. మరి ముఖ్యంగా..తెలుగు భాష గురించి వెంకయ్య గారు చెప్పిన విషయాలు..అబ్బబ్బో..అదుర్స్ అనుకోండి. స్పీచ్ లో ఎటువంటి తడబాటు లేకుండా..అనర్గళంగా తెలుగు మాట్లాడటమే కాకుండా..మమ్మీ అంటే మూతి లో నుండి మాత్రమే వస్తుంది..అదే అమ్మ అనే పదం నరనరాలన్నీ కదిలి మరి వస్తుందని..అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని సెలవిచ్చారు.
ఇదంతా బాగానే వుంది కానీ..ఇటీవల స్పెషల్ స్టేటస్ విషయంలో ఆ తెలుగు ని ఎక్కడ వదిలేశారని..ఈ ఫంక్షన్ లో వెంకయ్య నాయుడు తెలిపిన తీరును ఉద్దేశించి..వెంకయ్యకి డైరెక్టుగా ప్రశ్న సంధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ స్టేజ్ పై వెంకయ్య నాయుడు గారిని అడిగాడు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని, స్పెషల్ ప్యాకేజీ మాత్రమే అంటూ..అంతా ఆంగ్లంలోనే తెలిపిన వెంకయ్యనాయుడు గారు..తెలుగు భాష గురించి 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేదిక పై చెప్పడం..చెప్పే తీరు బాగున్నా..అస్సలు ప్రజలు మదిలోకి వెళ్ళలేదంటే నిజంగా నిజం. మరి అయన మాట్లాడిన తీరుపై..ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే.. తెలుగు జాతి కి అయన ఏం ద్రోహం చేశారో.. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో సాక్షిగా అయినా తెలిసివచ్చే అవకాశం ఉంటుంది.