Advertisement
Google Ads BL

హమ్మయ్య.. పుకార్లకు తెరపడింది..!


నాగచైతన్య-సమంతల మధ్య ఎప్పటి నుంచో ప్రేమాయణం నడుస్తున్న సంగతి, త్వరలో వీరి వివాహం జరగనున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా తమ మధ్య ప్రేమాయణం నడుస్తున్న విషయాన్ని సమంత మీడియాకు తెలిపే వరకు మీడియా కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది. ఆమద్య ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను చైతూతో ప్రేమ విషయంలో ఎన్నో క్లూలు ఇచ్చానని, కానీ మీడియానే దానిని కనిపెట్టలేకపోయిందని తెలిపింది. దీంతో క్లూలు ఇవ్వడమే సమంత అలవాటని భావించిన మీడియా, సమంత తన చేతికి ఉన్న ఉంగరాన్ని పోస్ట్‌ చేయగానే వారిద్దరి మధ్య రహస్యంగా నిశ్చితార్ధం జరిగిందంటూ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. 

Advertisement
CJ Advs

మరోవంక నాగ్‌ తన చిన్న కొడుకు అఖిల్‌ నిశ్చితార్దాన్ని ముందుగా జరిపి, చైతూ-సమంతల నిశ్చితార్ధం విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో మరిన్ని పుకార్లు మొదలయ్యాయి. అఖిల్‌ కంటే అతను పెళ్లి చేసుకోనున్న శ్రేయాభూపాల్‌ వయసులో పెద్దది కావడంతో ఆ విషయం మీడియాకు తెలియకముందే నాగ్‌ అఖిల్‌ పెళ్లిని ముందుగా చేయాలనుకొంటున్నాడని కొన్నిసార్లు, చైతూ-సమంతల జాతకాలలో దోషాలున్నాయని, అందుకే వాటి దోషనివారణ పూజలు, కార్యాల తంతు ముగిసే సమయానికి ఆలస్యం అవుతుండటంతో ముందుగా అఖిల్‌ పెళ్లి చేస్తున్నాడని మరికొన్ని సార్లు రూమర్స్‌ మొదలయ్యాయి. 

ఏదిఏమైనా మొత్తానికి చైతూ - శ్యామ్‌ల నిశ్చితార్దానికి తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 29న వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే అఖిల్‌ నిశ్చితార్ధానికి, వివాహానికి మద్య ఆరునెలల గ్యాప్‌ తీసుకున్నారని, ప్రస్తుతం చైతూ-శ్యామ్‌ల ఎంగేజ్‌మెంట్‌ పనుల్లో నాగ్‌ బిజీగా ఉన్నాడంటున్నారు. మొత్తానికి ఇదే నిజమైతే ఇకపై ఇలాంటి రూమర్లకు చెక్‌పడుతుందని, ఇది అక్కినేని అభిమానులకు మరో తీపి వార్త అని చెప్పవచ్చు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs