Advertisement
Google Ads BL

అయోమయంలో మెగాఫ్యాన్స్‌..!


మెగాస్టార్‌ చిరంజీవి 9ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి హీరోగా రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్‌150'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని తన తల్లి సురేఖ సమర్పణలో, చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాతగా వినాయక్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రెండు పాటలను ఇటీవల సోషల్‌మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. దేవిశ్రీ స్వరపరిచిన 'అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు..', 'సుందరి.. సుందరి' సాంగ్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుకను జరపకుండా నేరుగా డిసెంబర్‌25న క్రిస్మస్‌ కానుకగా మార్కెట్‌లోకి విడుదల చేస్తామని తెలిపారు. 

Advertisement
CJ Advs

కాగా ఈ ఆడియో కోసం కోటికళ్లతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మెగాభిమానులకు ఈ చిత్రం యూనిట్‌ షాక్‌ ఇచ్చింది. ఈ చిత్రం ఆడియో నిన్న విడుదల కాలేదు. ఇప్పటికే మొదట ఆడియోను విజయవాడలో అభిమానుల సమక్షంలో ఘనంగాచేయాలని ప్రయత్నాలు చేసి చివరి క్షణంలో క్యాన్సిల్‌ చేయడం మెగాభిమానులకు మొదటి షాక్‌. క్రిస్మస్‌ కానుకగా ఈ పాటలను డైరెక్ట్‌గా ఇంకా మార్కెట్‌లోకి విడుదల చేయకపోవడం వారికి సెకండ్‌ షాక్‌ అనే చెప్పాలి. ఆడియో విషయంలో కనీసం చిత్ర యూనిట్‌గానీ, ఆడియోను విడుదల చేస్తున్న లహరి మ్యూజిక్‌ సంస్థ గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. అసలు ఈ చిత్రం విషయంలో ఏదీ క్రమబద్దంగా జరగడం లేదు. దీనికి గల కారణాలు మెగాక్యాంప్‌కే తెలియాలి. మరి జనవరి4న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ను అభిమానుల సమక్షంలో విజయవాడలో భారీగా చేయనున్నామని ప్రకటించారు. మరి ఈ వేడుక అయినా ఉంటుందో లేదో తెలియని అయోమయస్థితిలో మెగాభిమానులున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs