Advertisement
Google Ads BL

యాంగ్రీ ఓల్డ్‌మ్యాన్‌ మెప్పిస్తాడా..?


తన కెరీర్‌ పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడు సాయికుమార్‌ వాయిస్‌తో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రల ద్వారా రాజశేఖర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరహా పాత్రలు ఆయనకు ఓ వర్గం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కాగా ఈ మధ్యకాలంలో వెండితెరపై ఆయన కనిపించి చాలా కాలం అయింది. 'ఎవడైతే నాకేంటి', 'గోరింటాకు' చిత్రాల తర్వాత ఆయనకు చాలా గ్యాప్‌ వచ్చింది. అడపాదడపా కనిపించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చాలా లాంగ్‌గ్యాప్‌ తర్వాత ఆయన ప్రస్తుతం యువ దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఆయన మరలా తనకు అచ్చొచ్చిన పవర్‌ఫుల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం తన లుక్‌ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే పలువురు సీనియర్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్స్‌ నుంచి కూడా టిప్స్‌ సేకరిస్తున్నాడంటున్నారు. ఈ చిత్రం మేజర్‌ షెడ్యూల్‌ ఇటీవలే జార్జియాలో జరిగింది. త్వరలో థాయ్‌లాండ్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తికానుంది. త్వరలో ఈ చిత్రానికి ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఎంపిక చేసి, అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. మొత్తానికి ఈ యాంగ్రీయంగ్‌మేన్‌.. సారీ... యాంగ్రీ ఓల్డ్‌మ్యాన్‌ ఈ చిత్రంతోనైనా మరలా ట్రాక్‌ ఎక్కుతాడో?లేదో ? వేచిచూడాల్సివుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs