Advertisement
Google Ads BL

తమన్నా పార్టీలో ఉపాసన అలకకి కారణం..!


ఇటీవల హైద్రాబాద్‌ లో తమన్నా తన బర్త్‌డే పార్టీని జరుపుకుంది. ఈ పార్టీకి మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తన భార్య ఉపాసనతో హాజరవ్వగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అఖిల్‌ కూడా ఈ పార్టీకి హాజరై బాగా ఎంజాయ్‌ చేశారు. అనంతరం తమన్నా బర్త్‌డే పార్టీలో బాగా ఎంజాయ్‌ చేశామంటూ రకుల్‌, ఉపాసనలు ట్విట్‌లు కూడా చేశారు. అయితే తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ట్విట్‌ చేసిన దానిని బట్టి చూస్తే.. రామ్‌చరణ్‌ భార్యకి ఈ పార్టీలో తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తీరు అస్సలు నచ్చలేదట. అందుకు అలిగిందని రకుల్‌ ట్విట్‌ చేసింది. అందుకు కారణం కూడా తెలిపిందనుకోండి. 

Advertisement
CJ Advs

ఇంతకీ ఉపాసన అలకకి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కదా..! గ్రీన్‌ టీ. అవును ఉపాసన అలిగింది గ్రీన్‌ టీ కోసమే. ఉపాసన లేకుండా రకుల్‌, తమన్నాలు గ్రీన్‌ టీ త్రాగారంట. తను లేకుండా వారు గ్రీన్‌ టీ తాగడం ఉపాసనకి కోపం వచ్చిందని, తనని కూడా గ్రీన్‌ టీకి పిలవాల్సిందని వారు అనుకుంటున్నారు. అందుకే ఉపాసనకి వారు చేసిన పని నచ్చలేదంట. ఇదిలా ఉంటే..తమన్నా మాత్రం తన బర్త్‌డే పార్టీని బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పుకుంటోంది. రామ్‌చరణ్‌, ఉపాసన, రకుల్‌, అఖిల్‌ వంటి వారి సమక్షంలో బర్త్‌డే వేడుకను జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పుకుంటూ తమన్నా..తెగ సంబరపడిపోతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs