Advertisement
Google Ads BL

సత్తా చాటుతోన్న మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌..!


చాలామంది మంచి సినిమాలు రావడం లేదు.. అంటూ విమర్శిస్తుంటారు. కానీ అదేమి చిత్రమో గానీ బాలీవుడ్‌ మిష్టర్‌పర్‌ఫెక్షనిస్ట్‌ ఏ చిత్రం చేసినా అది మంచి చిత్రమైపోతుంది. కథల ఎంపికలో అంతగా ఆచితూచి అడుగులు వేస్తాడు ఈ స్టార్‌. గత రెండు నెలలుగా కరెన్సీ కొరత వల్ల బాక్సాఫీస్‌ వద్ద ఒక్క బాలీవుడ్‌ చిత్రం కూడా కనీసం ఓ బ్లాక్‌బస్టర్‌ని ఇవ్వలేకపోయింది. ఆ సమయంలో అందరూ అమీర్‌ నటిస్తున్న 'దంగల్‌'పైనే ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను అమీర్‌ ఇప్పుడునిలబెడుతున్నాడు.

Advertisement
CJ Advs

దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్లను చూస్తుంటే, దేశంలో నిజంగా కరెన్సీ కొరత ఉందా? అని అనుమానం వేయకమానదు. తాము ఇంతకాలంగా భద్రంగా దాచుకొన్న సొమ్మును సినిమా టిక్కెట్ల రూపంలో ఈ చిత్రంపై సినీ ప్రియులు కనకవర్షంగా కురిపిస్తున్నారు.నలుగురు ఆడపిల్లల తండ్రిగా, రెజ్లర్‌గా అమీర్‌ పడ్డ కష్టానికి ఈ చిత్రం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 45 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో 30కోట్లు, ఓవర్‌సీస్‌లో 15 కోట్లు లభించాయి. ఇక శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రం అదరగొట్టే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం హవా చూస్తుంటే లాంగ్‌రన్‌లో 300కోట్లను మించి వసూలు చేయడం ఖాయమని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs