జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. ప్రస్తుతం పవన్ 'కాటమరాయుడు' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం త్రివిక్రమ్ సినిమా సెట్‌పైకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చిన్న కన్ఫూజన్ న్యూస్ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రంలో పవన్ సరసన త్రివిక్రమ్, బన్నీల చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'లో నటించిన ఉపేంద్ర నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ కోసం ఉపేంద్రని తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఉపేంద్ర ప్లేస్‌లోకి మరో హీరో వచ్చి చేరాడు. జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న మోహన్‌లాల్‌ని ఆ పాత్ర కోసం సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్‌లాల్‌కి ఉన్న క్రేజ్..దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్. అయితే ఎంత వరకు నిజం అనే కన్ఫూజన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయితే చిత్రంలో ఉన్నది మాత్రం నిజం. కానీ ఆ పాత్రకి ఉపేంద్రా..లేక మోహన్‌లాలా అనేది తెలియాలంటే త్రివిక్రమ్ కాంపౌండ్ నుండి న్యూస్ బయటికి రావాల్సిందే. అప్పటి వరకు ఈ కన్ఫూజన్ తప్పదు మరి.