Advertisement
Google Ads BL

ఈ స్టార్స్ ని కోటీశ్వర్లుని చేస్తుందవే..!


నేడు సినిమా స్టార్స్‌కి సినిమాలలో నటించినందుకు వచ్చే ఆదాయం కన్నా వాణిజ్య ప్రకటనలు, పలు కార్పొరేట్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తోంది. దక్షిణాదిలో ఎంతో క్రేజ్‌ ఉన్న రజనీ, పవన్‌ వంటి వారు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ఇష్టపడరు కాబట్టి వారు కేవలం సినిమాలలో నటించినందుకు వచ్చే రెమ్యూనరేషన్‌ మీదనే ఆధారపడతారు. కానీ మహేష్‌ వంటి స్టార్‌ హీరోలు మాత్రం వాణిజ్య ప్రకటనలకు ఏవైనా సరే తమకు మంచి మొత్తం ఇస్తామంటే చాలు ఆయా సంస్ధలకు గులాం అయిపోతుంటారు. దాంతో మహేష్‌ క్రేజ్‌ పరంగా చూసుకుంటే రజనీ, పవన్‌ల కంటే తక్కువైనప్పటికీ సంపాదనలో మాత్రం అందరికంటే ముందుంటాడు.ఇక బాలీవుడ్‌ హీరోల సంగతి చెప్పనే అక్కర్లేదు. 

Advertisement
CJ Advs

ఈమధ్య కాలంలో సరైన హిట్‌లేక నిన్నటికి నిన్న తాను హీరోగా చేసిన 'మొహంజదారో' డిజాస్టర్‌ అయినప్పటికీ హృతిక్‌రోషన్‌ మాత్రం అందరినీ పక్కకునెట్టి కార్పొరేట్‌ యాడ్స్‌ సాయంతో ఏకంగా అడ్వాన్స్‌ట్యాక్స్‌గా 80కోట్లు కట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. త్వరలో ఆయన నటిస్తున్న 'కాబిల్‌' చిత్రం విడుదలకానుంది. గత ఏడాది 50కోట్లు అడ్వాన్స్‌ట్యాక్స్‌ కట్టి అప్పుడే సంచలనం సృష్టించిన హృతిక్‌ ఈసారి దానికి 30కోట్లు అదనంగా జోడించి 80కోట్లు కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదని అందరూ తేల్చేస్తున్నారు. హీరోలుగా ఓ వెలుగువెలుగుతున్న అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ వంటి వారిని ఈ ఫ్లాప్‌ హీరో ఆదాయపరంగా దాటిపోవడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs