కన్నడ భామ ప్రణీత 'బావ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సెటిల్ అవుదామని భావించింది. కానీ ఆ సినిమా ప్లాప్ తో ప్రణీత డీలా పడిపోయింది. మళ్ళీ త్రివిక్రమ్ వంటి టాప్ డైరెక్టర్ చేతిలో పడి స్టార్ హీరో పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్రణీత 'అత్తారింటికి దారేది' లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అయితే అయ్యింది కానీ ప్రణీత లక్కు అస్సలు కలిసిరాలేదు. అయితే ప్రణీత 16 అనాలా తెలుగింటి ఆడపిల్లలా కనబడినా కూడా ఆమెకు నటనలో మెళుకువలు పెద్దగా తెలియక, లక్కు కలిసిరాలేక ఆమె టాప్ హీరోయిన్ కాలేకపోయింది.
ఇక మోహన్ బాబు తనయుడు మనోజ్ సరసన నటించింది. అయితే తెలుగులో వర్కౌట్ అవ్వక తమిళం, కన్నడ వైపు మళ్ళిన ప్రణీత చిన్న చితక సినిమాల్లో కనబడుతుంది. పలు అవార్డు ఫంక్షన్స్ లో మెరిసిన ప్రణీత కి ఒక కోరిక ఉందట. అదేమిటంటే ప్రణీత సినిమాల్లోకి రాకముందు ఆమె తల్లితండ్రులు ఆమెని డాక్టర్ ని చెయ్యాలనుకున్నారట. అయితే ప్రణీత సినిమాల్లోకి రావడం వల్ల ఆమె డాక్టర్ కాలేకపోయిందట. అయితే ఆ లోటును ఏదైనా సినిమాలో తీర్చుకోవాలని ప్రణీత ఆరాటపడుతుందట. ఏదైనా సినిమాలో డాక్టర్ గా నటించాలని ప్రణీత కోరుకుని అలాంటి పాత్ర కోసం వెయిట్ చేస్తుందట. మరి ప్రణీత రియల్ లైఫ్ కోరిక రీల్ లైఫ్ లోనైనా నెరవేరుతుందో...లేదో చూద్దాం.