రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'వంగవీటి' చిత్రం అదురు బెదురూ లేకుండా థియేటర్లు లోకొచ్చేసింది. అదురు బెదురూ అని ఎందుకన్నామంటే.... విజయవాడ రాజకీయాల్లో రెండు గ్రూపులు గా ఏర్పడి ఒక్కో గ్రూపు ఒక్కో ప్రత్యేకతతో ముందుకు నడుస్తున్న పరిస్థితుల్లో వర్మ ఏ వర్గాన్ని బలపరిచి ఏ వర్గాన్ని తొక్కేసాడా అని వంగవీటి మోహన రంగా అభిమానులు సినిమా విడుదల ఎప్పుడు అవుతుందా, రంగాకి వ్యతిరేకంగా ఈ సినిమాలో ఏమైనా ఉంటుందా.. ఉంటే వర్మ అంతు చూడాలని తిరుగుతున్నారు.
మరి నేను ఎవ్వరికి భయపడను, ఏ బెదిరింపులకు లొంగను అని డప్పు కొట్టుకునే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఎంతవరకు సక్సెస్ అయ్యాడో ప్రేక్షకులు మొదటి షో కే తీర్పు చెప్పేసారు. ఇక వర్మ బెజవాడ రాజకీయాలను ప్రత్యక్షంగా చూపెట్టకుండా, కనీసం రాజకీయ పార్టీల పేర్లను సైతం హైడ్ చేసేసాడు. ఇక విజయవాడ రాజకీయ చరిత్రలో ఒక వెలుగు వంటి ఎన్టీఆర్, జలగం వెంగళరావు, శిరీష్ రాజు వంటి రాజకీయ నేతల కేరెక్టర్స్ ను అలా అలా చూపించాడు. కమ్మ, కాపు వర్గాల మధ్యన జరిగిన గొడవలను వర్మ తన స్టయిల్ లో తెరకెక్కించాడు. ఇక రంగ వైఫ్ రత్న కుమారిని నెగెటివ్ గా చూపించిన వర్మ దేవినేని ఫ్యామిలీని హైలెట్ చేసాడు. మరి రాజకీయాలను కులంకషంగా చూపెట్టకుండా.... టైటిల్ పరంగా రౌడీ ఇజంలో రంగా పాత్రని, నిజ జీవితం లో రంగా పాత్రని హైలెట్ చెయ్యకుండా వర్మ ఎలా ఈ చిత్రాన్ని వంగవీటి పేరుతొ తెరకెక్కించాడో? అయితే ఎవరికైనా భయపడే వర్మ ఇలా చేశాడా? నేనెవ్వరికి భయపడను అంటూ లెక్చెర్స్ ఇచ్చే వర్మ ఎవరి వత్తిళ్ళకైనా తలొగ్గాడా? అని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలు పెట్టారు.