Advertisement
Google Ads BL

వర్మ జోస్యం: పవన్ జనసేన 100% సక్సెస్ !


రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. వర్మ అసలెందుకు ట్వీట్స్ చేస్తుంటాడో అతనికే తెలియని పరిస్థితుల్లో చాలా గొడవలు కొని తెచ్చుకుంటుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా వంగవీటి చిత్రమే తన చివరి చిత్రమని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా చివరి ఫంక్షన్ ని కూడా హైదరాబాద్ లో గ్రాండ్ లెవల్లో కానిచ్చేశాడు. ఏదో రాము సినిమాలకి దర్శకత్వం వహించడం మానేస్తాడని చాలా మంది పైకి బాధపడుతున్నప్పటికీ లోలోన హమ్మయ్య పిచ్చి, తిక్క సినిమాలు చూసే బాధ తప్పుతుందని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మీడియా సమావేశం లో పవన్ ని లేపి లేపనట్టు ఆకాశానికి ఎత్తేసాడు. పవనిజం కోసం కొంతమంది అడగగా పవన్ కి పవనిజంకి తేడా ఉందని... తాను రామూయిజం అనే ప్రోగ్రాం చేస్తున్నాని చెప్పాడు. ఇక రామూయిజం పై తానూ 45  గంటలు మాట్లాడానని... కానీ పవన్ మాత్రం పవనిజంపై కనీసం నాలుగున్నర నిముషాలు మాట్లాడలేదని అన్నాడు. అసలు పవన్ ఒక నిద్రపోతున్న అగ్ని పర్వతం అని.... సైలెంట్ గా వున్నా కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూనే ఉంటాడని... అగ్నిపర్వతం లాంటి పవన్ కూడా ఎప్పుడో బద్దలవుతాడని అన్నాడు.

వచ్చే 2019  ఎన్నికల్లో జనసేన పెద్ద సంచలనం సృష్టించి అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని... పాలిటిక్స్ లో పవన్ పక్కాగా 100  శాతం సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs