బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బోయపాటి ఈ సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి ఒక ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాలంటే ఈ సినిమాకి సంబందించి ఏదో ఒక సంచలనం ఉండాలని భావించిన బోయపాటి తాను తెరకెక్కించే సినిమాల్లో ఎన్టీఆర్ ని, అల్లు అర్జున్ ని గెస్ట్ రోల్ చెయ్యమని అడిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తో బోయపాటి 'దమ్ము' చిత్రాన్ని తీయగా అది యావరేజ్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో కూడా 'సరైనోడు' తీసి హిట్ కొట్టాడు. మరి తమతో సినిమాలు తెరకెక్కించిన బోయపాటి మాటను ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒప్పుకుంటారా... లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సు.
మరి ఈ చిత్రానికి ఇప్పటికే ఒక బడ్జెట్ కి కమిట్ అయ్యారట చిత్ర నిర్మాతలు. 22 కోట్ల వరకు బడ్జెట్ పెడదామని అనుకున్న నిర్మాతలకు ఎన్టీఆర్, అల్లు అర్జున్ గనక గెస్ట్ రోల్స్ చేస్తే వాళ్ళ పారితోషకాలతో కలిపి ఈ సినిమా బడ్జెట్ దాదాపు 30 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒప్పుకున్నప్పటి మాట ఇది. చూద్దాం బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో ఎన్టీఆర్, బన్నీ నటిస్తారో లేక దర్శకుడికి నో చెబుతారో చూద్దాం.