Advertisement
Google Ads BL

హ్రితిక్ రోషన్ ను అభినందించిన రజినీకాంత్..!


సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ భారతదేశంలో క్రేజ్ ఉన్న వ్యక్తి. అటువంటి స్టార్ మన్ననలను పొందటం బాలీవుడ్ హీరోలకు కూడా గర్వకారణం. ఇప్పుడు రజినీకాంత్ ప్రశంశలను అందుకోవటం బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ వంతు అయింది. 

Advertisement
CJ Advs

హ్రితిక్ నటించిన 'బలం' చిత్రం ట్రైలర్ ను, పాటలను చూసిన రజినీకాంత్, హ్రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు.  హ్రితిక్ నటనను, ప్రతిభను ఆయన ప్రత్యేకంగా పొగిడారు. ఈ వార్త విన్న హ్రితిక్ రోషన్ ఎంతగానో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

రజినీకాంత్, హ్రితిక్ తండ్రి రాకేష్ రోషన్ లది 30 సంవత్సరాలుగా కొనసాగుతోన్న బంధం. హ్రితిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన 'భగవాన్ దాదా' చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హ్రితిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం. అప్పుడు హ్రితిక్ వయసు 12 సంవత్సరాలు. 

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 25న కాబిల్ విడుదల కాబోతోంది. ఇదే చిత్రం తెలుగులో బలంగా వస్తోంది. హ్రితిక్ , యామి జంటగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ను సంజయ్ గుప్తా డైరెక్ట్ చేయగా, రాకేష్ రోషన్ నిర్మించారు.  రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో హ్రితిక్, యామి ఇద్దరు అంధులుగా నటించటం విశేషం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs