రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క స్టార్ హీరో పక్కన నటించిన రకుల్ చిన్న హీరోల పక్కన కూడా నటిస్తూ కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. మరో పక్క వ్యాపార రంగంలో కూడా దూసుకు పోతున్న రకుల్ చాలా పద్దతి గల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో దర్శకుడు ఎలా చెబితే అలా నడుచుకుని... షూటింగ్ కి టైం కి రావడం దగ్గర నుండి ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే రకుల్ ఇప్పుడు ఒక దర్శకుడి మాట వినలేదని ప్రచారం జరుగుతుంది.
రకుల్ 'ధృవ' చిత్రం కంప్లీట్ కాగానే నాగ చైతన్య - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో నాగ చైతన్య కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ వైజగ్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన విషయాలన్నీ చాలా సీక్రెట్ గా ఉంచాలని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చిత్ర యూనిట్ సభ్యులకి సూచించాడట. అయితే యూనిట్ మొత్తం దర్శకుడి మాట విన్నా కూడా రకుల్ మాత్రం దర్శకుడి మాట లెక్క చెయ్యకుండా ఆ సినిమా కి సంబందించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఇలా చేసినందుకు గాను దర్శకుడు కళ్యాణ్ రకుల్ ని మందలించినట్లు... వారి మధ్యన కొద్దిగా గొడవ జరిగినట్లు వార్తలొస్తున్నాయి.అయితే రకుల్ మాత్రం అసలలాంటి గొడవేం జరగలేదని ఈ వార్తలని కల్పితాలని కొట్టి పడేసిందట.