వరసగా తన ట్వీట్స్‌తో బిజెపి అధిష్టానంపై నిప్పులు కక్కుతున్న జనసేనాధిపతి పవన్‌పై పలువురు బిజెపి సానుభూతిపరులు కక్ష్య కట్టి, వేధింపులకు రెడీగా ఉన్నారని సమాచారం. దీనికి కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలు లోపాయికారి మద్దతు ఇస్తుండటంతో వారు పవన్‌పై రెచ్చిపోతున్నారు. కాగా ఇటీవల సుప్రీంకోర్టు దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రతిషోకి ముందు ఖచ్చితంగా జాతీయగీతాన్ని తెరపై ప్రదర్శించాలని, ప్రేక్షకులు కూడా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. ఇటీవల రాంగోపాల్‌వర్మ, అరవింద్‌స్వామి వంటి వారు కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. తాజాగా పవన్ ఈ విషయంలో ఓ ట్వీట్ చేశాడు. కుటుంబంతో, స్నేహితులతో సినిమా చూసి, సరదాగా సాయంత్రాన్ని గడపాలనుకునే ప్రేక్షకులు దేశభక్తిని చాటుకోవాలనే నిర్ణయంపై నిరుత్సాహం వ్యక్తపరిచాడు. కేవలం సినిమా హాళ్లలోనే జాతీయగీతం ఎందుకు పాడాలి? మన దేశంలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలలో కూడా ప్రతిరోజు జాతీయగీతాన్ని ఆలపించి, ప్రజలకు స్పూర్తి కలిగించాల్సిన అవసరం లేదా? అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. ఇలాంటి కామెంట్సే చేసిన వర్మ, స్వామిలని వదిలేసి, కేవలం పవన్‌పైనే మండిపడుతున్న ఓ బిజెపి సానుభూతిపరుడైన హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది హైకోర్టులో పవన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడమే కాదు.. సరూర్‌నగర్ పోలీస్‌స్టషన్‌లో కూడా ఆయనపై కేసు పెట్టాడు. మరి పవన్ వ్యాఖ్యలు వాస్తవంగా, ప్రతిపౌరుడి మదిలో ఉన్న విషయాన్ని ఆయన ప్రశ్నించారు. మరి ఇది తప్పేలా అవుతుందో అర్ధం కావడం లేదని, కేవలం పవన్‌పై కక్ష్య సాధింపుగానే ఈ పిటిషన్ వేశారని స్పష్టంగా అర్ధమవుతోందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.