Advertisement
Google Ads BL

ఆ ఎన్టీఆర్‌ బాటలోనే పవన్‌ కళ్యాణ్..!


స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, రచయితలు, లిరిక్‌ రైటర్స్‌ వంటి వారు తెరవెనుక ఆయనకు మంచి సహకారం అందించారు. ఆయన రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడేలా దాసరి 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు' వంటి చిత్రాలను తీశాడు. ఇక పరుచూరిబ్రదర్స్‌, నాగభైరవ కోటేశ్వరరావుతో పాటు చాలా మంది ఆయన భవిష్యత్తు కార్యాచరణ, ప్రజలకు, సమాజానికి ఆయన చేయదలుచుకున్న మంచి పనులను ప్రేక్షకులకు, అభిమానులకు, ప్రజలకు విడమర్చి చెప్పేందుకు తమవంతు సాయం అందించారు. ఆయన చేసిన ప్రసంగాలలోని పలు ఉద్వేగభరితమైన అంశాలను...ప్రసంగాలను రచయితలు పరుచూరిబ్రదర్స్‌తో పాటు మరికొందరు సంభాషణల రచయితలు తీర్చిదిద్దారు. కొందరు పాటల రచయితలు తెలుగుదేశం పార్టీపై ఉత్సుకత రేపేలా పార్టీ ప్రమోషన్‌ కోసం పాటలను రాసి, వాటిని ఆడియో రూపంలో రూపొందించి ఎన్టీఆర్‌కు సహాయపడ్డారు. ప్రస్తుతం కూడా 'జనసేన' పార్టీని స్దాపించి త్వరలో పూర్తి స్థాయి రాజకీయలలోకి ఎంట్రీ ఇవ్వనున్న పవర్‌స్టార్‌ పవన్‌ వెనుక కూడా ఆయనంటే అభిమానమున్న పలువురు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం. ఆయన వెనుక దర్శకరచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సాయిమాధవ్‌ బుర్రా వంటి వారు ఆయనకు మంచి ప్రమోషన్‌ కలిగించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారట. ప్రస్తుతం జనసేన పార్టీ ఆశయాలను తెలుపుతూ ఓ ప్రముఖ పాటల రచయిత ఆయన పార్టీ కోసం సాంగ్స్‌ రాస్తున్నాడని, వాటిని ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్వరపరుస్తున్నారని సమాచారం. వీరితోపాటు పలు సామాజిక అంశాలను ఔపోసన పట్టిన మేథావులు, రాజకీయ నిపుణులైన విశ్లేషకులు కూడా పవన్‌కు తమవంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఐదు అంశాలపై రోజుకో ట్వీట్‌ చేస్తోన్న పవన్‌ మంచి మంచి అంశాలను లేవనెత్తుతూ, తనదైన శైలిలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆయన ఎదురుదాడికి బిజెపి నాయకులు నోరెళ్లబెడుతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs