డేరింగ్ డైరెక్టర్ గుణశేఖర్ త్వరలో 'హిరణ్యకస్యప' అనే టైటిల్‌తో 'ది స్టోరీ ఆఫ్ భక్తప్రహ్లాద' అనే క్యాప్షన్‌తో పౌరాణిక గాధను భారీగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్‌రెడీ ఈ టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేయించిన ఆయన ఈ విషయాన్ని అఫీషియల్‌గా కూడా ప్రకటించాడు. హిరణ్యకస్యపుడి పాత్ర నెగటివ్ రోల్ కావడంతో ఈ చిత్రంలో ఎవరిని ఆ పాత్రకు ఎంపిక చేయాలా? అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు.
అయితే గుణ మీద నమ్మకం లేని పలువురు ఆయనకు సన్నిహితులైన స్టార్ హీరోలు కూడా తాము బిజీగా ఉన్నామంటూ తప్పించుకొని తిరుగుతున్నారట. కాగా ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందనేది గుణ కోరికగా తెలుస్తోంది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు వేయడంలో ఘనాపాఠి అని ఇప్పటికే ఆల్‌రెడీ ప్రూవ్ అయింది. 'యమదొంగ' చిత్రంలో యంగ్ యముడిగా ఆయన నటన అద్వితీయం అనే ప్రశంసలు వచ్చాయి. ఇలా యముడి వంటి పౌరాణిక నెగటివ్ రోల్‌ను చేసి మెప్పించిన జూనియర్‌కు గుణ మంచి స్నేహితుడు, ఎన్టీఆర్ బాలనటునిగా ఫుల్‌లెంగ్త్‌గా రామునిగా నటించిన 'బాల రామాయణం' చిత్రానికి గుణనే దర్శకుడన్న సంగతి తెలిసిందే.
దాంతో గుణ ఎన్టీఆర్ ఈ పాత్రకు అంగీకరిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్నాడట. కానీ జూనియర్ మాత్రం తాను ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ బిజీలో తనకు వీలుకాదని చెప్పాడని సమాచారం. దాంతో ఇక గుణకు దగ్గుబాటి రానా ఒక్కడే ఆప్షన్‌గా కనిపిస్తున్నాడంటున్నారు. నెగటివ్ రోల్స్‌చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న రానా ఈ చిత్రానికి తన అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అయితే ఇంత భారీ బడ్జెట్‌తో గుణ ప్లాన్ చేసిన ఈ చిత్రంలో రానానటిస్తే పెద్దగా అంచనాలు ఏర్పడవని, దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా వర్కౌట్ కాదని, ఇది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.