Advertisement
Google Ads BL

నిజంగా 'శాతకర్ణి' ఇలాగే వుండేవాడేమో..!!


సినిమా మొదలైనప్పటి నుంచి బాలయ్య వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం టీజర్‌తోనే సంచలనాలు సృష్టించింది. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ అదరగొడుతోంది. వాస్తవానికి నేటితరం హీరోల్లో .. మరీ ముఖ్యంగా సీనియర్‌ స్టార్స్‌లో బాలయ్య తప్ప ఇలాంటి కేరెక్టర్‌కు ఎవ్వరూ సూటబుల్‌ కాదనేది వాస్తవం. ఈ చిత్రం ట్రైలర్‌లో బాలయ్య రాజుగా చూపించిన రాజసం, అద్భుతమైన గెటప్‌, ఆయన చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఆయన ఠీవి చూస్తే మనం ఎప్పుడూ చూడని 'గౌతమీపుత్ర శాతకర్ణి' నిజంగానే ఇలా ఉండేవాడేమో అనిపించకమానదు. ఇక దర్శకనిర్మాత క్రిష్‌ టేకింగ్‌ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తుందని ట్రైలర్‌ చూస్తేనే అర్ధమైపోతోంది. అద్భుతమైన లోకేషన్స్‌, సెట్టింగ్స్‌, విజువల్స్‌, అదిరిపోయే డైలాగ్స్‌, యుద్ద సన్నివేశాలు వంటివి కేక పుట్టించే రేంజిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌గా అంటే దాదాపు 50కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి... సినిమా నిర్మాణంలో కూడా ఎంతో ధైర్యంగా భాగస్వామిగా ఉన్న క్రిష్‌ను అభినందించక తప్పదు. బాలయ్య మార్కెట్‌కు ఈ బడ్జెట్‌ ఎక్కువే అయినప్పటికీ ఇలాంటి చారిత్రక గాథలకు ఈ బడ్జెట్‌ చాలా తక్కువనే చెప్పాలి. అయినా కూడా ఈ చిత్రం క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ విషయంలో క్రిష్‌ను ఎంత పొగిడినా తక్కువే.

Advertisement
CJ Advs

'బాహుబలి' వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల ట్రైలర్స్‌ రేంజ్‌లోనే ఈ చిత్రం ట్రైలర్‌ కూడా ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో రాఘవేంద్రరావు, రాజమౌళిల శైలిలోనే మహారాణిగా నటిస్తున్న శ్రియతో రొమాంటిక్‌ సీన్స్‌, గ్లామర్‌ను కూడా జోడించి తెరకెక్కించినట్లుగా అర్ధమవుతోంది. రాజమాత పాత్రకి హేమమాలిని ఎంతో నిండుదనం తెచ్చింది. ఇక ఈ చిత్రం బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదిరిపోయింది. ఈ చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్‌ అర్దాంతరంగా తప్పుకున్న తర్వాత ఈ చిత్రంపై సంగీతపరంగా కొంత ఎఫెక్ట్‌ పడవచ్చని కొందరు భావించారు. కానీ 'కంచె' తర్వాత టాలీవుడ్‌లోనే అదీ క్రిష్‌ దర్శకత్వంలోనే రెండో చిత్రం చేస్తున్న సంగీత దర్శకుడు చింతరంజన్‌ భట్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఈ ట్రైలర్‌కు మరో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన వారందరికీ సంక్రాంతికి బాలయ్య మరోసారి చిరుకు గట్టిపోటీ ఇవ్వడం ఖామయనే సంగతి అర్ధమైపోతోంది. 

Click Here for Gautamiputra Satakarni Trailer

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs