Advertisement

మహేష్‌ మాట నిలబెట్టుకుంటాడు..కానీ ....?


'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత ఆ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలపై మహేష్‌ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. దాంతో 'బ్రహ్మోత్సవం' చిత్రం ఒప్పుకున్నాడు. దీంతో ఈ చిత్రానికి విడుదలకు ముందు ఎంతగానో క్రేజ్‌ వచ్చింది. అందునా ఈ చిత్రాన్ని పివిపి వంటి ప్రతిష్టాత్మక బేనర్‌ ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ చిత్రం డిజాస్టర్‌ అయింది. దాంతో పలువురు, మరీ ముఖ్యంగా మహేష్‌ ఫ్యాన్స్‌ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలపై విమర్శల వర్షం కురిపించారు. కానీ మహేష్‌ ఈ ప్రచారాన్ని అప్పుడే ఖండించాడు. ఈ విషయంలో శ్రీకాంత్‌ను తప్పుపట్టాల్సిన పనిలేదని, తానే ఆయనకు పిలిచి ఈ అవకాశం ఇచ్చానని, ఈ చిత్ర పరాజయంలో తన పాత్ర కూడా ఎక్కువేనని ఒప్పుకున్నాడు. 

Advertisement

స్వతహాగా మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా తాను హీరోగా పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడు ఏ చిత్రమైనా ఫ్లాప్‌ అయితే అందులో తన పాత్ర కూడా ఉందని ఎంతో ధైర్యంగా ఒప్పుకునేవాడు. ఆయా నిర్మాతలకు ఆ తర్వాత మరో చిత్రం చేసిపెట్టేవాడు. అవే లక్షణాలను మహేష్‌ పుణికిపుచ్చుకున్నాడని 'బ్రహ్మోత్సవం' సమయంలో మహేష్‌ను పలువురు మెచ్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత పివిపికి మరో చిత్రం కూడా చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా పివిపినే ప్రకటించాడు. మహేష్‌తో తమకు రెండు చిత్రాలకు అగ్రిమెంట్‌ ఉన్నదని, కాబట్టి రెండో చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తాము మహేష్‌ హీరోగా మరో చిత్రం చేయనున్నామని ప్రకటించారు. మహేష్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు మహేష్‌ అఫిషియల్‌గా స్పందించలేదు.

కాగా గతకొద్దిరోజుల కిందట వంశీపైడిపల్లి-మహేష్‌ల చిత్రానికి పివిపిని తప్పించారని, ఆ స్థానంలో ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ చిత్రంపై అలాంటి వార్తలే ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుతానికి తానున్న బిజీలో పివిపికి మరో చిత్రం చేస్తానని, కానీ దానికి మరింత సమయం ఉందని మహేష్‌ అంటున్నాడంటున్నారు. ఈ చిత్రం విషయంలో మరో తాజా వార్త ఏమిటంటే.. దీనికి దిల్‌రాజుతో పాటు అశ్వనీదత్‌ కూడా భాగస్వామిగా వ్యవహరించనున్నాడని సమాచారం. 'సైనికుడు' డిజాస్టర్‌ తర్వాత అశ్వనీదత్‌కి మరో చిత్రం చేస్తానని మహేష్‌ హామీ ఇచ్చాడని, అందులో భాగంగానే ఈ చిత్రంలో అశ్వనీదత్‌ను భాగస్వామిని చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. మరి 'సైనికుడు' తర్వాత ఇంత కాలానికి అశ్వనీదత్‌కు ఇచ్చిన మాటను నిలుపుకుంటున్న మహేష్‌, మరి 'బ్రహ్మోత్సవం' ద్వారా భారీగా నష్టపోయిన పివిపికి మరో చిత్రం ఎంతకాలానికి చేస్తాడో? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement