Advertisement
Google Ads BL

రోహిత్ వేముల ఆత్మహత్యపై స్పందించిన పవన్..!


జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస ట్వీట్లతో చెలరేగిపోతున్నాడు.   నిన్నటికి మొన్న గోవధపై పెద్ద ఎత్తున స్పందించిన పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల విషయంపై స్పందించాడు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన అధికార భాజపాపై విరుచుకు పడ్డాడు.   సామాజిక సమస్యలపై, అస్పృశ్యత అంశంపై విస్తృతంగా పోరాటం జరుపుతున్న రోహిత్ ను భాజపా వ్యక్తిగతంగా తీసుకొని అతని మరణానికి కారణమైందని వెల్లడించాడు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సమారస్య పూర్వకంగా పరిష్కరించాలి గానీ, ఆ సమస్య ద్వారా విద్యార్థుల ప్రాణాలు బలికొనేందుకు చేయూతనందించకూడదని ఆయన హెచ్చరించాడు. భాజపా అంటే ఇష్టం లేకపోతే స్వయంగా భాజపానే రంగంలోకి దిగి రోహిత్ వేములను వేధించిందని, అలాగే ప్రాజాస్వాయ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని పవన్ వివరించాడు. కాగా రోహిత్  వేముల విషయంలో భాజపా తప్పుమీద తప్పు చేసిందని పవన్ తెలిపాడు. 

Advertisement
CJ Advs

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న రోహిత్ వేముల లోకం పోకడను అర్థం చేసుకొని సమ సమాజ స్థాపన నిమిత్తం అతని పోరాటం కొనసాగించాడని, అందుకనే కక్ష కట్టి భాజపా రోహిత్ ను వేధించిందని పవన్ వెల్లడించాడు. సహజంగా భారత్ లో లక్షలాది మంది ప్రజలు భాజపాను వ్యతిరేకిస్తున్నారని వారందరినీ భాజపా  అలాగే వేధిస్తుందా? అంటూ దుమ్మురేగిపోయే ట్వీట్ చేశాడు పవన్. ఒక విద్యార్థి ప్రజాస్వామ్యం కల్పించిన భావంతో సమాజం కోసం ప్రశ్నిస్తున్నప్పుడు, అలా తన నిరసనను తెలుపుతున్నప్పుడు భాజపా వ్యక్తిగతంగా ఎలా తీసుకుంటుందని పవన్ తెలిపాడు. అలాగే రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాయంటూ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్. 

ఇంకా పవన్ ట్వీట్ల ద్వారా రోహిత్ వేముల ఇష్యూపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నిజంగా రోహిత్ ఉద్యమాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే.. ఆ శాఖ ద్వారా విచారణ చేపట్టాలి గానీ, ఇంతటి కార్యానికి కేంద్రం ఎందుకు పూనుకుందో తెలపాలని వెల్లడించాడు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత అన్ని పార్టీలు కూడా ఈ విషయాన్ని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకున్నాయని దాని ద్వారా రోహిత్ కుటుంబానికి ఎటువంటి లబ్ధి చేకూరలేదని తెలిపాడు. ఈ విషయంలో రోహిత్ మరణం తర్వాత కూడా భాజపా రోహిత్  ను దళితుడు కాదని  నిరూపించేందుకు మాత్రమే ఎక్కువగా ఏకాగ్రత పెట్టిందని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం తగవని పవన్ పేర్కొన్నాడు. కాగా దేశంలోని విశ్వవిద్యాలయాలు విద్యా వేదికలుగా ఉండాలని, రాజకీయ పార్టీలు చొరబడి వాటిని యుద్దభూములుగా మార్చేందుకు ప్రయత్నించవద్దని ట్విట్టర్ వేదికగా పవన్ తనదైన శైలిలో ప్రశ్నాస్త్రాలను సంధించాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs