మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం గురించి రోజుకో వార్త సంచలనంగా బయటికి వస్తుంది. ఈ సినిమా అటు తెలుగు, ఇటు తమిళంలోను ఒకేసారి తెరకెక్కించడం.... ఇక మురుగదాస్ ఏదైనా కొత్తదనంగా ఉండాలని అన్ని వెరైటీగా అలోచించి సినిమాలు చెయ్యడం..... ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో నటించడం దగ్గర నుండి అన్ని ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్న ఈ మధ్య ఈ సినిమా టైటిల్ లో ఇదే అంటూ 'సంభవామి' అనే టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడం మరవక ముందే నిన్నటికి నిన్న ఈ సినిమాలో తమిళ్ హీరో భరత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడని చెబుతున్నారు.
ఇక ఇప్పుడు మహేష్ - మురుగదాస్ చిత్ర స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర కథ ఏమంత కొత్తది కాకపోయినా దీనిలో ఒక మంచోడు, చెడ్డోడు అనే అన్నదమ్ములతో రెండు పాత్రలతో ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడని చెబుతున్నారు. అయితే మహేష్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడా లేక వేరెవరైనా మహేష్ సోదరుడిగా కనిపిస్తాడా అనేది తెలియాల్సి వుంది. ఇక ఈ చిత్రం 'తుపాకీ' సినిమాకి సీక్వెల్ అని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయాన్నీ మురుగదాస్ ఎక్కడా రివీల్ చెయ్యలేదు. ఇంకా ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా రకుల్ ప్రీత్...మహేష్ కి జోడిగా నటిస్తుంది.