Advertisement
Google Ads BL

వెంకీ ఫిట్‌నెస్‌ వెనుక సీక్రెట్‌ ఏమిటి..?


వయసు మీద పడుతున్నా కూడా సీనియర్‌స్టార్‌ వెంకటేష్‌ ఆమధ్య విడుదలైన 'గురు' ఫస్ట్‌లుక్‌లో గడ్డం పెంచి బాక్సింగ్‌ కోచ్‌గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా వెంకీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. సీరియస్‌గా సాగే ఈ కథాంశంలో కూడా వెంకీ సరదాగా డ్యాన్స్‌ మూమెంట్స్‌ వేస్తూ కనిపించాడు. ఇక ఆయన ఫిట్‌నెస్‌ను చూసిన వారికి ఆశ్యర్యం కలుగకమానదు. కాగా ఈ టీజర్‌లో బ్యాగ్రౌండ్‌లో వచ్చే సాంగ్‌, వెంకీ వాయిస్‌లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో వెంకీ స్వయంగా ఓ పాటను పాడనున్నాడు. ఈ సాంగ్‌ను త్వరలో రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో తన మేకోవర్‌, ఫిట్‌నెస్‌ల గురించి వెంకీ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్‌ను బయటపెట్టాడు. 

Advertisement
CJ Advs

తన అన్న కొడుకు రానాకు ఫిట్‌నెస్‌ ట్రైలర్‌గా పనిచేసే కనుల్‌గిర్‌ పర్యవేక్షణలో ఆయన నెలల పాటు కఠోర శ్రమ చేసి,ఈ ఫిట్‌నెస్‌ను సాధించానని చెప్పుకొచ్చాడు. అందుకోసం కఠినమైన ఆహార నియమాలను కూడా పాటించానని ఆయన తెలిపాడు. ఈ చిత్రం జనవరి 26న రిపబ్లిక్‌ డే కానుకగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన 'నేను.. శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లూ... మీకు జోహార్లు' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన సరసన నిత్యామీనన్‌ నటించనుంది. మరోపక్క ప్రస్తుతం బాలకృష్ణతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం చేస్తోన్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో వెంకీ ఓ సోషియో ఫాంటసీ చిత్రానికి కూడా ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. 

కాగా ఈ చిత్రంలో ఆయన లక్కీ హీరోయిన్‌ నయనతారను మరోసారి తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నయనకు వెంకీ అంటే ప్రత్యేక అభిమానం, చిరంజీవి, బాలయ్య వంటి వారికి కూడా నో చెప్పిన నయన వెంకీ సరసన ఇటీవల 'బాబు బంగారం'లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ ఆమె బిజీ షెడ్యూల్స్‌ వల్ల లేటయిందనే విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. మరి క్రిష్‌ చిత్రంలో నయననే తీసుకోవాలని భావిస్తుండటంతో మరోసారి ఈ జంట వార్తల్లోకి వచ్చింది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs