Advertisement
Google Ads BL

ఆల్‌రౌండర్‌ మన జేజమ్మ..!


అనుష్క... ఈమె పేరు వింటే మన తెలుగు ప్రేక్షకులకు పవర్‌ఫుల్‌, లేడీ ఓరియంటెడ్‌ పాత్రలే గుర్తుకు వస్తాయి. 'అరుంధతి, పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్‌జీరో' వంటి చిత్రాలలో నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలు చేసిన ఆమె 'బాహుబలి' పార్ట్‌1లో కొద్ది సేపే స్క్రీన్‌పై అదీ ముసలి వేషంలో కనిపించింది. కానీ ఈ చిత్రం సెంకడ్‌ పార్ట్‌లో మాత్రం ఆమె రొమాంటిక్‌గా కనిపిస్తూనే, మరోవైపు కత్తి యుద్దాలు, గుర్రపుస్వారీలు చేసి మరోసారి తన ప్రతాపం చూపించనుంది. కాగా పూరీజగన్నాథ్‌-నాగార్జునల కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్‌' చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ కెరీర్‌ మొదట్లో ఎన్నో గ్లామర్‌ పాత్రలు చేసి, బికినీలు కూడా వేసి, నాభి సుందరిగా యువతరం గుండెల్లో అలజడి రేపింది. 

Advertisement
CJ Advs

కానీ 'అరుంధతి' చిత్రంతో ఆమె ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది. అయినా కూడా 'మిర్చి' వంటి చిత్రాలలో కూడా తన ఒంపుసొంపులతో సెగలు పుట్టించింది ఈ యోగాటీచర్‌. త్వరలో ఆమె, శృతిహాసన్‌లు కలిసి హీరోయిన్లుగా స్టార్‌ సూర్య నటించిన 'ఎస్‌3' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె తన గ్లామర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు కనువిందు చేయనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని పోస్టర్లు విడుదల చేశారు. వీటిలో అనుష్క ఓ రేంజ్‌లో అందాలను ఒలకబోస్తూ కనిపిస్తోంది. 

దాంతో ఈ చిత్రంపై ఆమె అభిమానులకు ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తానికి ఈ చిత్రంతో అనుష్క అందాల ఆరబోత చేయనుందని అర్ధమైపోతోంది. ఇక ఇదే సమయంలో యువి క్రియేషన్స్‌బేనర్‌లో 'పిల్లజమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో 'భాగమతి' అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తోంది. ఇది హిస్టారికల్‌ చిత్రమని, కాదు.. కాదు... ఇది ఓ హర్రర్‌ చిత్రమని ఇలా పలువార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇది ఓ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రమని, ఇందులో నిజాయితీ కలిగిన పవర్‌ఫుల్‌ ఐ.ఎ.ఎస్‌ ఆఫీసర్‌గా అనుష్క కనపించుందని సమాచారం. దాదాపు 30కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కూడా సగానికి పైగా పూర్తయింది. ఇందులో ఆదిపినిశెట్టి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌లు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs