దిల్‌రాజు ఎంత తెలివైన నిర్మాతో.. అంతకు మించి ఎంతో తెలివితేటలున్న డిస్ట్రిబ్యూటర్ అనేది అందరికీ తెలిసిన సంగతే. కాగా ఆయన తాజాగా గోల్డెన్‌లెగ్‌గా పేరు తెచ్చుకుని, చిన్న చిత్రాలకు పెద్దహీరోయిన్‌గా మారి లక్కీగర్ల్‌గా వెలుగొందుతున్న హెబ్బాపటేల్ ప్రధానపాత్రను పోషిస్తోన్న 'నాన్న...నేను... నా బాయ్‌ఫ్రెండ్స్' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమెకు తండ్రిగా విలక్షణ నటుడు రావురమేష్ కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ ఇద్దరు తప్ప ఈ చిత్రంలో పెద్దగా పేరున్న నటీనటులు ఎవ్వరూ లేరు. లక్కీ మీడియా బేనర్‌లో బెక్కంవేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ బండి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హెబ్బాపటేల్‌కు బాయ్‌ఫ్రెండ్స్‌గా పార్వతీశం, నోయల్, అశ్విన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 16న దిల్‌రాజు విడుదల చేయనుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. కాగా ఈ చిత్రం ప్రమోషన్ కోసం తయారుచేసిన టీవీ ప్రకటనల్లో దిల్‌రాజు పుణ్యమా అని ఆయనకు సాయం చేయడానికి మన హీరోలు బాగా ట్రై చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ కావాలంటే ఏం చేయాలి? అని హెబ్బాపటేట్ అడుగుతుంటే దానికి నాని, సునీల్, సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ నుండి విజయ్ దేవరకొండ వరకు ఆమెకు సలహాలు ఇస్తూ చేసిన యాడ్స్ చాలా ఆసక్తిగా, ఎంటర్‌టైనింగ్‌గా నిలిచి, ఈ చిత్రానికి మంచి క్రేజ్ తేవడంలో చాలా ఉపయోగపడుతున్నాయి. వీరంతా కేవలం దిల్‌రాజుతో ఉన్న స్నేహం దృష్ట్యా ఇలా ఫ్రీ ప్రొమోషన్ చేశారని సమాచారం. మొత్తానికి దిల్‌రాజు ప్లాన్ అదిరిపోయిందని అందరూ ఒప్పుకుంటున్నారు.