Advertisement
Google Ads BL

చిరంజీవిలా రజనీని టెంప్ట్ చేస్తున్నారంట..!


ఎవరూ ఊహించని విధంగా తమిళనాట రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. అనారోగ్యం కారణంగా చాలా కాలం పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ మధ్యనే కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీయంకే, ప్రతిపక్షంలో ఉన్న డీయంకే పార్టీలలో కదలికలు ప్రారంభమయ్యాయి. కాగా కాస్తో కూస్తో ప్రజల్లో పలుకుబడి ఉన్న ప్రతి మనిషీ  ప్రజా నాయకుడు కావాలనే ఆరాటం ఉన్న విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రజాసేవ చేయాలన్న ఆరాటం వస్తుంది. అది ఆ నాయకుడిని క్షణం నిలవనీయదు. అలా ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవికి కూడా బాగా జనాల్లో మంచి పేరు రావడం, అభిమానులు తండోపతండాలుగా ఉండటంతో ప్రజాభిమానియై ఆ విధంగా ప్రజానాయకుడు కావాలన్న తలంపుతో ప్రజారాజ్యం అన్న పేరుతో సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అసలే సినిమా హీరో కాబట్టి, అలా పొగిడేస్తే ఇలా పడిపోతుంటారని టాక్. అందుకనే అప్పట్లో చిరంజీవి పార్టీపెట్టేందుకు ఊతమిచ్చి, చిరంజీవిని రాజకీయ రంగంలోకి దించారు కొంతమంది కాపు నాయకులు. మరికొంత మంది సినీ పెద్దలు, ఇంకొంత మంది మెగా అభిమానులు.  వారు మాత్రం ఇప్పుడు ప్రభుత్వంలో మంచి పదవులు అనుభవిస్తున్నారు పరకాల ప్రభాకర్, గంటా శ్రీనివాసరావులాంటి వారు. కానీ చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి ఉన్న ఇమేజ్ కే డ్యామేజ్ తెచ్చుకున్నాడు. ప్రజా నాయకుడుగా రాణించలేక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు.  

Advertisement
CJ Advs

కాగా చిరంజీవిలాగానే రజనీకాంత్ ను కూడా రాజకీయాల్లోకి దించాలని చూస్తున్నారు కొంతమంది తమిళనాట పార్టీలకు చెందిన నాయకులు. కానీ రజినీకాంత్‌ కు చిరంజీవిలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా గొప్ప స్టార్‌డమ్ మాత్రం ఉంది. కాగా ఈ సమయంలో రజనీకాంత్ తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఇక తిరుగులేదు అన్నట్లుగా కార్యకర్తులు, అభిమానులు కూడా టెంప్ట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చిరంజీవి నుండి రజనీ కాంత్ గుణపాఠం నేర్చుకొని రాజకీయాలకు తాను ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న తమిళనాట రాజకీయ పరిస్థితులు చూస్తే మాత్రం రజనీకి బాగా అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని రజనీకాంత్ క్యాచ్ చేసుకుంటాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs