Advertisement
Google Ads BL

మహేష్ సినిమాలో మరో తమిళ్ హీరో..!


మహేష్ తో తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నిన్నటికి నిన్న మహేష్  సినిమా టైటిల్ ఇదే అంటూ 'సంభవామి' అనే టైటిల్ తో ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇక ఇప్పుడు ఆ 'సంభవామి' టైటిల్ పట్ల మహేష్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు  వార్తలొస్తున్నాయి. అదలా ఉంటే తాజాగా  ఇప్పుడు మహేష్ - మురుగదాస్ చిత్రం లో మరో హీరో నటిస్తున్నాడనే  ప్రచారం మొదలైంది.

Advertisement
CJ Advs

తమిళంలో పాపులర్  అయిన హీరో భారత్ ని మురుగదాస్ ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ కి తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. భరత్ రోల్ సినిమాకి కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఇక భరత్ ని తెలుగు ప్రేక్షకులు 'బాయ్స్' సినిమా నుండి చూసి ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో అతన్ని తెలుగు, తమిళ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో మురుగదాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రం లో తమిళ్ డైరెక్టర్ మరియు హీరో అయిన ఎస్ జె సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ మొదటిసారి నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs