Advertisement
Google Ads BL

సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న పవర్‌స్టార్‌..!


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హిట్టు, ఫ్లాప్‌లను పట్టించుకోడు. అంతే కాదు...సెంటిమెంట్స్‌ను కూడా పెద్దగా నమ్మడు. కానీ ఆయన అభిమానులకు మాత్రం కొన్ని సెంటిమెంట్స్‌ ఉంటాయి. అందులో తప్పులేదు, ఇక ఆయన హిట్‌,ఫ్లాప్స్‌ను పట్టించుకోకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆయన నుండి పెద్దపెద్ద బ్లాక్‌బస్టర్‌ చిత్రాలనే కోరుకుంటారు. దీంతో వారికోసమైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కొన్ని సెంటిమెంట్స్‌ను ఫాలో అయి తన అభిమానులకు సినిమాపై నమ్మకం పెరిగేలా చేయకతప్పని పరిస్థితి. మరీ ముఖ్యంగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' డిజాస్టర్‌ తర్వాత ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' పై ఆయన ఫ్యాన్స్‌ ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అందుకే ఈ చిత్రంలో తనకు అచ్చివచ్చిన రెండు మూడు సెంటిమెంట్స్‌ను ఆయన ఈ చిత్రం కోసం ఫాలో అవుతున్నాడు. తనకు మరలా ఓ టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన సెన్సేషనల్‌ మూవీ 'గబ్బర్‌సింగ్‌' లో తన సరసన నటించిన శృతిహాసన్‌తో ఆయన ఈ చిత్రంలో మరోసారి జోడీ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య పవన్‌ చిత్రాలన్నింటి షూటింగ్‌ను పొలాచ్చిలో జరపడం సెంటిమెంట్‌గా మారింది. దాంతో త్వరలో ఆయన తన 'కాటమరాయుడు' చిత్రం కోసం పొలాచ్చి వెళ్తున్నాడు. ఈ చిత్రం తమిళ హిట్‌ మూవీ 'వీరం' ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌ మిడిల్‌ ఏజ్‌ కలిగిన ఫ్యాక్షన్‌ లీడర్‌ పాత్రను పోషిస్తున్నాడు.ఇక 'గబ్బర్‌సింగ్‌' లో పవన్‌ తమ్మునిగా కనిపించిన అజయ్‌ ఈ చిత్రంలో కూడా ఆయన నలుగురు తమ్ముళ్లలో ఒకడిగా నటిస్తున్నాడు ఈ చిత్రం గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కనుంది. అందుకోసం పొలాచ్చిలోని కొన్ని లోకేషన్లలో విలేజ్‌ వాతావరణానికి అనుగుణంగా చాలా సీన్స్‌ను పవన్‌, శృతిహాసన్‌లపై చిత్రీకరించనున్నాడు దర్శకుడు డాలీ. డిసెంబర్‌ 3వ వారంలో ఈ షెడ్యూల్‌ మొదలవుతుంది. అక్కడ 15రోజుల పాటు షూటింగ్‌ చేస్తారు. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ 70శాతంకు పైగా పూర్తవుతుంది. అనూప్‌రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుందని సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs