Advertisement
Google Ads BL

అందరినీ సస్పెన్స్‌లో పడేసిన డైరెక్టర్..!


'రుద్రమదేవి' తీసి సెహభాష్‌ అనిపించుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ పౌరాణిక గాథ అయిన 'హిరణ్యకస్యప' ను భారీ బడ్జెట్‌తో స్వీయదర్శకత్వంలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుణశేఖర్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రానికి 'ది స్టోరీ ఆఫ్‌ భక్తప్రహ్లాద' ను శీర్షికగా పెట్టాడు. ఇక ఈ చిత్రం రాక్షసరాజైన హిరణ్యకస్యపుని కోణంలో భక్తప్రహ్లాద చరిత్రను చూపించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు. అదేసమయంలో ఇందులో ఓ తెలుగు, తమిళ భాషల్లో పేరున్న స్టార్‌ హిరణ్యకస్యపుడిగా నటించనున్నాడని, త్వరలో అది ఎవరు? అనేది చెప్తానన్నాడు. ఇక ప్రస్తుతం అగ్రహీరోలు కూడా నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలను చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో ఈ చిత్రంలో హిరణ్యకస్యపునిగా నెగటివ్‌ క్యారెక్టర్‌ను ఎవరు చేయనున్నారు? తెలుగు, తమిళ భాషల్లో ఆ క్రేజ్‌ ఉన్న హీరో ఎవరు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. కాగా ఈ చిత్రంలో నటించబోయే నటుడు ఎవరనే దానిపై ముగ్గురు, నలుగులు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. 'రుద్రమదేవి'లో గోన్నగన్నారెడ్డిగా బన్నీని పవర్‌ఫుల్‌గా చూపించి మెప్పించిన గుణ ఈ చిత్రంలో కూడా అల్లుఅర్జున్‌ను ఒప్పించాడనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క రానా, విక్రమ్‌, సూర్యల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరి వీరిలో ఎవరు ఆ పాత్రను చేయనున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని తన గుణ టీమ్‌ వర్క్స్‌తో పాటు ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధతో కలిసి నిర్మించనున్నట్లు గుణశేఖర్‌ ప్రకటించాడు. మరి ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏమిటి? అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ విషయంలో కూడా సురేష్‌ప్రొడక్షన్స్‌, గీతాఆర్ట్స్‌, స్టూడియో గ్రీన్‌ వంటి నిర్మాణ సంస్థల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియకపోయినా మొత్తం మీద గుణ మాత్రం ఈ చిత్రం విషయంలో అందరినీ సస్పెన్స్‌లో పడేశాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs