సిల్క్ స్మిత జీవితంపై డర్టీ పిక్చర్ సినిమా వచ్చాక కథా నాయికల జీవితాలను తెరకెక్కించడంలో దర్శకులు అమితంగా ఉత్సాహం చూపుతున్నారు. అందులో భాగంగా సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈయన తెరకెక్కించబోయే ఈ చిత్రానికి 'మహానటి' అని ముందుగానే పేరు కూడా పెట్టేసుకున్నాడు. కాగా ఈ చిత్రం తాలూకూ స్క్రిప్టు వర్కు ను కూడా చాలా కాలం నుండి దర్శకుడు రూపొందించే పనిలో నిమగ్నమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్క్రిప్టు వర్క్ ను పూర్తి చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ విషయంపై ఇంత ఉన్నఫలంగా టాక్ బయటకు రావడానికి కారణం దర్శకుడు నాగ్ అశ్విన్, సమంతను కలిసి చాలా సేపు మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో నాగ్, సమంతను కలవడంపై అందరికీ సావిత్రి పాత్రకి సమంతను ఎంపిక చేసుకోనున్నారా అనే టాక్ బయటకు బాగా వ్యాపించింది. అయితే సావిత్రి పాత్రను నిత్యామీనన్ తో చేయిస్తారనే టాక్ ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొట్టింది. తాజాగా నాగ్, సమంతను కలిసి చాలా సమయం ఆమెతో మాట్లాడటంతో సావిత్రిగా సమంతను ఎంచుకోనున్నారనే విషయం భలే షికార్లు చేస్తుంది. ఏది ఏమైనా సావిత్రి పాత్రకు తగిన నాయికపై ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడలేదు. ఒకవేళ నిజంగా సమంతగానీ, సావిత్రి పాత్ర చేయాల్సి వస్తే నటనకు మంచి ప్రాధాన్యం ఉన్న రోల్ లో అద్భుతంగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు అవకాశం దక్కినట్టే. చూద్దాం ఏం జరుగుతదో.